AP ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు
ఏపీ ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్ అందుకు ఒప్పుకోలేదు. ఏపీ ప్రభుత్వ అభ్యర్థన (English Medium In AP Schools)ను తోసిపుచ్చింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఏపీ ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమానికి తప్పనిసరి చేస్తూ 81, 85 జీవోలు తీసుకురావడం తెలిసిందే. ఇంగ్లీష్ మీడియం విషయంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే కోరుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్ అందుకు ఒప్పుకోలేదు. ఏపీ ప్రభుత్వ అభ్యర్థనను తోసిపుచ్చింది.
మాతృభాషలో విద్యా బోధన తప్పనిసరి జరగాలని విద్యా హక్కు చట్టంలో లేదని ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ లాయర్ కేవీ విశ్వనాథన్ సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఒకటి నుంచి ఆరో తరగతి వరకు పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని తప్పనిసరి చేస్తూ జీవోలు తీసుకొచ్చిందని వాదనలు వినిపించారు. దీంతో ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలను తప్పుపడుతూ, వాటిని రద్దు చేయాలనుకోవడం సరికాదని కోర్టుకు విన్నవించారు.
ఈ పిటిషన్‌పై స్పందించేందుకు నోటీసులు ఇస్తామని ధర్మాసనం తెలిపింది. అయితే ఆ నోటీసులలో పాటు హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని లాయర్ విశ్వనాథం ధర్మాసనాన్ని కోరగా నిరాశే ఎదురైంది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియం విషయంపై రెండు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. సెప్టెంబర్ 25కు విచారణ వాయిదా వేశారు.