Taraka Ratna Wife Alekhya Reddy: ఎన్నికల వేళ యువ నటుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు దివంగత నందమూరి తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో తాను ఎవరి పక్షమో అనేది స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో తన మద్దతు అతడికే అని మద్దతు ప్రకటించారు. అలేఖ్య ప్రకటన రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: AP Elections: ఏపీ ఎన్నికలపై ప్రముఖ హీరో జోష్యం.. ఆంధ్రప్రదేశ్‌లో గెలిచేది అతడే?


టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్రలో తారకరత్న అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తారక్‌ మృతితో అతడి భార్య అలేఖ్య సర్వం కోల్పోయింది. అతడి మరణం నుంచి ఆమె ఇంకా కోలుకోలేకపోతున్నారు. అయితే ప్రస్తుతం ఎన్నికల సమయం కావడంతో అందరూ అలేఖ్యను ప్రశ్నిస్తున్నారు. రాజకీయంగా మీరు ఎటువైపు ఉంటారని ప్రశ్నిస్తుండడంతో ఆమె తన సోషల్‌ మీడియా ద్వారా కీలక ప్రకటన చేశారు. 

Also Read: Jagan Stone Attack: జగన్‌పై రాళ్ల దాడిలో కీలక మలుపు.. రూ.350 క్వార్టర్‌ మందు కోసం రాయితో దాడి?


 


'వచ్చే ఎన్నికల్లో నా మద్దతు బాలకృష్ణ మామయ్యకే. నేను ఏ వైపు ఉన్నానని తరచూ ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పుడు దానిపై సరైన నిర్ణయం తీసుకున్నాను. నా మద్దతు, ప్రేమ నా కుటుంబంపైనే ఉంటాయి' అని పేర్కొన్నారు. తారకరత్న బాలకృష్ణకు కొడుకు వరుస అవుతాడు. తారకరత్న గుండెపోటు నుంచి ఆస్పత్రిలో చికిత్స, అంత్యక్రియలు అన్నీ వ్యవహారాలను బాలకృష్ణ దగ్గరుండి చూసుకున్నారు. సొంత తండ్రి మాదిరి అన్నింటిని పర్యవేక్షించారు. తారకరత్నను కోల్పోయిన అలేఖ్యకు బాలయ్య కొండంత అండగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో అలేఖ్య బాలకృష్ణకు మద్దతు ప్రకటించారు.


అయితే అలేఖ్య రెడ్డి వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నాయకుడు, ప్రస్తుతం నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డికి దగ్గరి బంధువు. తారకరత్న ఘటన జరిగినప్పుడు విజయసాయి కూడా వెన్నంటే ఉన్నారు. దీంతో ఆమె వైసీపీకి మద్దతు తెలుపుతారనే ప్రచారం జరిగింది. పుట్టింటి సైడు ఆమె నిలుస్తారని చర్చ జరగ్గా.. అలేఖ్య మాత్రం తన మెట్టినింటికే మద్దతునిచ్చారు. తారకరత్న సినిమాలు చేస్తూనే టీడీపీకి మద్దతుగా పని చేశారు. పార్టీ కార్యక్రమాల్లో తరచూ పాల్గొంటూ టీడీపీ బలోపేతానికి కృషి చేశారు. భర్తకు ఇష్టమైన పార్టీకే అలేఖ్య మద్దతు తెలపడం విశేషం.





 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి