Jagan Stone Attack: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ సీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాళ్ల దాడి జరగడం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. రాళ్ల దాడి విషయాన్ని పోలీస్ భ్రదతా దళాలు తీవ్రంగా పరిగణించింది. ఘటన జరిగిన రోజు నుంచే ప్రభుత్వ విభాగాలు విచారణ మొదలుపెట్టాయి. దాడిపై అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలు మొదలయ్యాయి. ప్రతిపక్ష పార్టీలే దాడి చేయించాయని జగన్ ఆరోపించారు.
Also Read: Jagan Convoy: సీఎం జగన్ పర్యటనలో అపశ్రుతి.. వాహనం ఢీకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు
రాజకీయంగా అలా ఉంటే ఈ ఘటనపై పోలీస్ అధికారులు ముమ్మర విచారణ చేపట్టారు. విచారణ చేస్తున్న క్రమంలో జగన్‌పై దాడికి పాల్పడింది ఎవరో గాలించి ఎట్టకేలకు ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం జగన్‌పై రాయి దాడి చేసింది విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీశ్ అనే వ్యక్తి అని తేలింది. అతడు వడ్డెర సామాజికవర్గానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. రాళ్ల దాడికి పాల్పడిన సతీశ్ నిందితుడు అని గుర్తించారు. అదుపులోకి తీసుకున్న అనంతరం విచారణ చేపట్టారు.
జగన్ రాళ్ల దాడి ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ఆ బృందం అదుపులో ఐదుగురు యువకులు ఉన్నారని సమాచారం. అయితే జగన్‌పై నేరుగా దాడికి పాల్పడినది సతీశ్ అని గుర్తించారు. విచారణ సమయంలో విస్తుగొలిపే విషయాలు బయటకు వచ్చాయి. నిందితుడు కేవలం క్వార్టర్ మందు కోసం దాడికి పాల్పడినట్లు తెలిసింది. మందు కోసం అతడు జగన్‌ను కొట్టాడని చెప్పారు.
అయితే నిందితుడు ఫ్లోరింగ్‌కు వాడే టైల్స్ ముక్కతో సీఎం జగన్‌పై దాడిచేసినట్లు పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. అదుపులోకి తీసుకుని నిందితుడిని జగన్‌తోపాటు గాయపడిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వెలంపల్లికి పోలీసులు చూపించారు. సీఎం జగన్‌పై దాడి కేసులో పోలీసులు కీలక సమాచారాన్ని గుర్తించారు. సీసీ ఫుటేజీ వీడియోల్లో నిందితుడిని గుర్తించినట్లు సమాచారం. దాడి చేయడానికి గల కారణాలను పోలీసులు తెలుసుకుంటున్నారు. క్వార్టర్ మద్యం రూ.350 డబ్బులు ఇస్తానంటే సీఎం సభకు వచ్చానని ఒప్పుకున్నట్లు సతీశ్ పోలీసులకు చెప్పినట్లు వార్త బయటకు వచ్చింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter