Chandra Babu:ఆంధ్రప్రదేశ్ లో లా అండ్ ఆర్డర్ పరిస్థితులు దారుణంగా ఉన్నాయని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణే లేకుండా పోయిందన్నారు. నేరాలను కంట్రోల్ చేయడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. అత్యాచారాలు, హత్యలను అదుపు చేయడంలో విఫలమైన పోలీసులతో పాటు నిందితులపై కఠినచర్యలు తీసుకోవాలంటూ ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి చంద్రబాబు లేఖ రాశారు. ఏపీలో కొన్ని రోజులుగా జరిగిన హత్యలు, హత్యాచారాలు, నేరాలకు సంబంధించిన వివరాలను , మీడియాలో వచ్చిన కథనాలను.. అందుకు సంబంధించిన వీడియోలను తన లేఖలో జత చేశారు చంద్రబాబు. వరుసగా జరుగుతున్న ఘటనలతో ఏపీ పరువు మంటకలుస్తోందని లేఖలో చెప్పారు చంద్రబాబు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అధికార మదంతో రెచ్చిపోతున్న వైసీపీ రౌడీలను నిలువరించడంలో ఖాకీలు విఫలమవుతున్నారని చంద్రబాబు విమర్శించారు. ఏలూరు జిల్లా జి కొత్తపల్లిలో వైసీపీ నేత గంజి ప్రసాద్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనలో తన భర్త హత్యకు తలారీ వెంకట్రావే కారణమని గంజి ప్రసాద్ భార్య చెప్పిన విషయాన్ని తన లేఖలో చంద్రబాబు చెప్పారు. శ్రీకాళహస్తి పాల సొసైటీ ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు వెళుతున్న టీడీపీ నేతలపై దాడి చేయడం దారుణమన్నారు చంద్రబాబు. అధికార పార్టీకి సపోర్ట్ చేస్తున్న పోలీసులు.. విపక్ష నేతలకు రక్షణ కల్పించడంలో విఫలమవుతున్నారని మండిపడ్డారు.


రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగా ఉంటే రేపల్లె రైల్వే స్టేషన్ లో గ్యాంగ్ రేప్ ఘటన జరిగేది కాదన్నారు చంద్రబాబు. అనంతపురం జిల్లాలో పెన్షన్ కావాలని అడిగిన టీడీపీ కార్యకర్తపై పోలీసు అధికారే దాడి చేశారంటే రాష్ట్రంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చన్నారు. అనకాపల్లి జిల్లా  కసింకోటలో పట్టపగలు తుపాకులతో బెదిరించి బ్యాంకులో దోపిడికి పాల్పడ్డారని చెప్పారు. ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు. ఎర్రచందనం రవాణాకు సంబంధించి వైసీపీ ఎంపీటీసీని  కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. విచ్చలవిడి మద్యం, గంజాయి వాడకం పెరగడం, డ్రగ్స్ వల్లే రాష్ట్రంలో నేరాలు పెరిగిపోతున్నాయని చెప్పారు. మత్తు మాఫియా వెనుక వైసీపీ నేతలు ఉన్నా.. పోలీసులు చూసిచూడనట్లు వదిలేస్తున్నారని చంద్రబాబు తన లేఖలో ఆరోపించారు.నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, శాంతి భద్రతలపై ఫోకస్ చేయాలని తన లేఖలో డీజీపీని కోరారు చంద్రబాబు నాయుడు.  


READ ALSO: Revanth Reddy: చంచల్ గూడ జైలుకు రేవంత్ రెడ్డి.. సీఎల్పీ అత్యవసర సమావేశం..


Bandi Sanjay Pada Yatra: కోయిల్ సాగర్‌ పనులు చూస్తే కోట శ్రీనివాస్‌ గుర్తుకొస్తున్నరు: బండి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.