Bandi Sanjay Pada Yatra: కోయిల్ సాగర్‌ పనులు చూస్తే కోట శ్రీనివాస్‌ గుర్తుకొస్తున్నరు: బండి

Bandi Sanjay Pada Yatra: ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతోంది. యాత్రలో భాగంగా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు బండి సంజయ్. పాదయాత్రలో భాగంగా సీఎం కేసీఆర్‌ పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఎంపీ బండి సంజయ్.  

Written by - ZH Telugu Desk | Last Updated : May 2, 2022, 02:01 PM IST
  • ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంగ్రామ యాత్ర
  • సీఎం కేసీఆర్‌ పాలనపై విమర్శనాస్త్రాలు సంధించిన బండి సంజయ్‌
  • వచ్చే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చిన బండి సంజయ్‌
 Bandi Sanjay Pada Yatra: కోయిల్ సాగర్‌ పనులు చూస్తే కోట శ్రీనివాస్‌ గుర్తుకొస్తున్నరు: బండి

Bandi Sanjay Pada Yatra: ఉమ్మడి పాలమూరు జిల్లా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతోంది. యాత్రలో భాగంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు బండి సంజయ్. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా సీఎం కేసీఆర్‌ పాలన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కోయిల్ సాగర్ పనులను చూస్తే కోట శ్రీనివాసరావు గుర్తుకొస్తున్నారని ఎద్దేవా చేశారు. కాలువ తవ్వి పనులు చేపట్టకుండా కేసీఆర్ ప్రజలను ఊరిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌కు సొంత ప్రయోజనాలే తప్ప..జనం బాధ పట్టవని ధ్వజమెత్తారు. గ్రామాల్లోకి టీఆర్ఎస్ నేతలు వస్తే నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 

‘‘కోయిల్ సాగర్ కెనాల్‌ను చూస్తే ‘అహనా పెళ్లంట’ సినిమాలో కోడిని కట్టేసి చికెన్ తింటున్న కోట శ్రీనివాసరావు సీన్ గుర్తుకొస్తోందని గుర్తు చేశారు బండి సంజయ్. కోయిల్ సాగర్ కాలువ కన్పిస్తుంది కానీ.. నీళ్లు మాత్రం రావన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 19వ రోజు నారాయణపేట నియోజకవర్గంలోని మణిపూర్ తండా మీదుగా రామకిష్టయ్య పల్లెదాకా పాదయాత్ర చేశారు బండి సంజయ్‌. కోయిల్ సాగర్ కాలువకు నీళ్లు పారితే రామకిష్టయ్యపల్లె సహా ఈ ప్రాంతానికి రెండు పంటలు పండుతాయని ఎంపీ బండి సంజయ్‌ చెప్పారు. గత ఎన్నికల్లో  కోయిల్ సాగర్ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు.   రైతుల ప్రయోజనాలు కేసీఆర్‌కు పట్టవని విమర్శించారు. కేసీఆర్‌కు లాభం జరుగుతుందంటే తప్ప ఏ పనీ చేయని నాయకుడని ఆరోపించారు.

వేల కోట్ల రూపాయల కమీషన్లు వస్తాయంటేనే కేసీఆర్ పనులు చేస్తారని తెలిపారు బండి సంజయ్. రాష్ట్రంలో ఉపాధి కూలీల సొమ్మును 3 నెలలుగా ఇవ్వడం లేదని గుర్తు చేశారు. ప్రతి ఉపాధి కూలీకి రూ.270లను కేంద్రం చెల్లిస్తోందని ప్రజలకు వివరించారు. ఆ సొమ్మును కూలీల ఖాతాల్లో వేయకుండా కేసీఆర్ జాప్యం చేస్తూ కూలీల పొట్ట కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాగు, తాగు నీళ్లు లేక పాలమూరు ప్రజలు అల్లాడుతుంటే... మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ శుద్ధ నీరిస్తున్నామని కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఈసారి టీఆర్ఎస్ నేతలు వస్తే నీళ్లేవని నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు బండి సంజయ్. పేదోళ్లకు మరో 5 నెలలపాటు రేషన్ బియ్యాన్ని ఉచితంగా సరఫరా చేసేందుకు సిద్ధమైతే...ఆ బియ్యాన్ని ఆపి కేసీఆర్ పేదల పొట్టకొడుతున్నారని చెప్పారు బండి సంజయ్. పేదోళ్లంతా ఏకమై కేసీఆర్ పాలనకు చరమ గీతం పాడాలన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలకు పిలుపునిచ్చారు బండి సంజయ్.

Also Read: Cm Uddhav Thackeray: పీఎం మోదీపై సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం ఉద్ధవ్ ఠాక్రే

Also Read: Suman Bery: నీతి ఆయోగ్​ వైస్​ ఛైర్మన్​గా సుమన్​ బేరీ.. రాజీవ్ కుమార్ స్థానంలో బాధ్యతల స్వీకరణ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News