ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (TDP)కి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ప్రకాశం జిల్లాలో టీడీపీ కీలకనేత, మాజీ శిద్ధా రాఘవరావు (Sidda Raghava Rao) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి శిద్దా రాఘ‌వ‌రావు ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ (YS Jagan Mohan Reddy) స‌మ‌క్షంలో వైఎస్సార్‌సీపీ చేరారు. శిద్దా రాఘ‌వ‌రావు, ఆయ‌న కుమారుడు ఇద్దరికీ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ పార్టీ కండువా కప్పి సాదరంగా వైసీపీలోకి ఆహ్వానించారు. ఏపీలో ఒక్కరోజులో 200కు పైగా కరోనా కేసులు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీడీపీలో కీలకనేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడు పార్టీని వీడటం ప్రతిపక్షానికి నిజంగానే ఎదురుదెబ్బగా కనిపిస్తోంది. శిద్దా రాఘవ రావు వైసీపీలోకి చేరిన ఈ కార్యక్రమంలో మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్‌, వెల్లంపల్లి శ్రీనివాస్‌ పాల్గొన్నారు. ఇప్పటికే ప్రకాశం జిల్లాలో కీలక నేతలు కరణం బలరాం, కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు సైతం టీడీపీని వీడగా తాజాగా జిల్లాలోని కీలకనేత శిద్దా రాఘవరావు పార్టీకి గుబ్ బై చెప్పారు.  ఏపీలో వారి ఖాతాల్లోకి రూ.10 వేలు


వైసీపీలో చేరిన సందర్భంగా మాజీ మంత్రి శిద్దా రాఘవరావు మీడియాతో మాట్లాడారు. గత ఏడాది కాలం నుంచి వైఎస్సార్ సీపీ ఎన్నో సంక్షేమ పథకాల్ని ప్రవేశపెట్టింది. దీనివల్ల పేద, మధ్య తరగతి ప్రజలు లబ్ది పొందుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా చేసుకుంటూ సీఎం వైఎస్ జగన్ ముందుకు వెళ్తున్నారు. భవిష్యత్తులోనూ సంక్షేమ పథకాలను ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను. వైఎస్ పాలన నచ్చిన కారణంగా తాను కూడా వైసీసీలో చేరి ప్రజలకు సేవ చేయాలని భావిస్తున్నట్లు మాజీ మంత్రి శిద్దా రాఘవరావు పేర్కొన్నారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
నటి మీరా చోప్రా హాట్ ఫొటోలు వైరల్