Telugu Desam Party Mini Manifesto For 2024 Assembly Elections: వచ్చే ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ రెడీ అవుతోంది. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా రాజమండ్రి వేదికగా జరుగుతున్న టీడీపీ మహానాడు సభలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు. 2024 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా మినీ మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు. ఇందులో మహిళలకు పెద్ద పీట వేయడంతోపాటు పేదలను ధనవంతులు చేస్తామని భరోసా ఇచ్చారు. మహిళల కోసం 'మహాశక్తి' కార్యక్రమం తెస్తామని చంద్రబాబు తెలిపారు. ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 మహిళల ఖాతాల్లో వేస్తామన్నారు. 18 నుంచి 50 ఏళ్లు ఉన్న ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి వర్తిస్తుందని.. ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి ఇస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఆరు కీలక పథకాలను ఆయన వెల్లడించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీడీపీ మినీ మేనిఫెస్టోలోని కీలక అంశాలు..


1) పేదలను ధనవంతులు చేయడం
==> టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేదలను సంపన్నులను చేస్తుంది. 
==> ఐదేళ్లలో పేదల ఆదాయాన్ని రెట్టింపు చేస్తుంది


2) బీసీలకు రక్షణ చట్టం
==> బీసీలకు రక్షణ చట్టం తీసుకువస్తాం.. ఈ చట్టం అన్ని విధాలా అండగా నిలుస్తుంది. 


3) ఇంటింటికీ నీరు
==> టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే "ఇంటింటికీ మంచి నీరు" పథకం కింద ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్


 4) అన్నదాత 
==> అన్నదాత పథకం కింద రాష్ట్రంలోని ప్రతి రైతుకు ఏడాదికి 15,000 రూపాయల ఆర్థిక సాయం 


5) మహాశక్తి


==> ప్రతి కుటుంబంలో 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు "స్త్రీనిధి" కింద నెలకు 1500 రూపాయలను నేరుగా వారి ఖాతాల్లో జమ 
==> 'తల్లికి వందనం' పథకం కింద మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికీ ఏడాదికి రూ.15 వేలు అందజేత 
==> "దీపం" పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం
==> "ఉచిత బస్సు ప్రయాణం" పథకం ద్వారా స్థానిక బస్సుల్లో మహిళలందరికీ టికెట్టులేని ప్రయాణ సౌకర్యం


6) యువగళం
==> రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన 
==> ప్రతి నిరుద్యోగికి 'యువగళం నిధి' కింద నెలకు 2500 రూపాయలు అందజేత  


Also Read: CSK Vs GT Dream11 IPL Final Match Dream11 Prediction: ఐపీఎల్ ఫైనల్‌కు వేళయా.. గుజరాత్‌కు చెన్నై చెక్ పెడుతుందా..? డ్రీమ్ 11 టీమ్ టిప్స్ ఇవే..


Also Read: CSK Vs GT IPL 2023: క్షణాల్లో మ్యాచ్‌ మార్చేసే వీరులు.. ఈ ఐదుగురు ఆటగాళ్లపై ఓ లుక్కేయండి..!  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి