CSK Vs GT Dream11 IPL Final Match Dream11 Prediction: ఐపీఎల్ ఫైనల్‌కు వేళయా.. గుజరాత్‌కు చెన్నై చెక్ పెడుతుందా..? డ్రీమ్ 11 టీమ్ టిప్స్ ఇవే..

Chennai Super Kings Vs Gujarat Titans Dream11 Prediction Today Match Tips: చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఐదోసారి టైటిల్ గెలవాలని చెన్నై చూస్తుండగా.. వరుసగా రెండోసారి టైటిల్ ముద్దడాలని గుజరాత్ టైటాన్స్ చూస్తోంది. డ్రీమ్ 11 టీమ్ టిప్స్ మీ కోసం..   

Written by - Ashok Krindinti | Last Updated : May 27, 2023, 11:28 PM IST
CSK Vs GT Dream11 IPL Final Match Dream11 Prediction: ఐపీఎల్ ఫైనల్‌కు వేళయా.. గుజరాత్‌కు చెన్నై చెక్ పెడుతుందా..? డ్రీమ్ 11 టీమ్ టిప్స్ ఇవే..

Chennai Super Kings Vs Gujarat Titans Dream11 Prediction Today Match Tips: క్రికెట్ పండుగ ముగింపు దశకు వచ్చేసింది. ఐపీఎల్‌ ఫైనల్‌కు సమయం ఆసన్నమైంది. నాలుగుసార్లు విజేత చెన్నై సూపర్ కింగ్స్‌తో డిఫెండింగ్‌ ఛాంపియన్ తలపడనుంది. క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లో గుజరాత్‌ను ఓడించి చెన్నై నేరుగా ఫైనల్‌కు చేరుకుంది. క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై విజయంతో గుజరాత్ టైటాన్స్ రెండో ఫైనలిస్ట్‌గా అడుగుపెట్టింది. వరుసగా రెండోసారి గుజరాత్ టైటిల్ కైవసం చేసుకుంటుందా..? చెన్నై ఐదోసారి విజేతగా నిలిచి ముంబై రికార్డును సొంతం చేస్తుందా..? ధోనికి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చెన్నై జట్టు టైటిల్ గెలవాలని ఎక్కువ మంది క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇరు జట్ల మధ్య రాత్రి 7.30 గంటలకు ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది.

పిచ్ రిపోర్ట్ ఇలా..

నరేంద్ర మోదీ స్టేడియం పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. అయితే ప్రారంభంలో బౌలర్లకు కొంత సహకారం అందుతుంది. ఈ పిచ్‌లపై మొదటి ఇన్నింగ్ సగటు 168 కాగా.. రెండో ఇన్నింగ్స్ స్కోరు 155. ఈ సీజన్‌లో మొదట బ్యాటింగ్ సగటు స్కోరు 187గా ఉంది. ఫైనల్ మ్యాచ్‌ కావడంతో టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్‌కు మొగ్గు చూపే అవకాశం ఉంది. రెండు జట్లలోనూ హార్డ్ హిట్టర్లు ఉండడంతో భారీ స్కోరింగ్ గేమ్‌గా జరిగే ఛాన్స్ ఉంది. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం లేదు. 

హెడ్ టు హెడ్ రికార్డులు

ఐపీఎల్‌లో చెన్నై, గుజరాత్ జట్లు 4 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఈ 4 మ్యాచ్‌లలో చెన్నై ఒక మ్యాచ్‌లో గెలవగా.. గుజరాత్ 3 సార్లు విజయం సాధించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రెండు జట్లు ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే తలపడ్డాయి. ఇందులో గుజరాత్ విజేతగా నిలిచింది. 

ప్లేయింగ్ 11 ఇలా.. (అంచనా)

చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, డేవాన్ కాన్వే, అజింక్యా రహానే, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (కెప్టెన్, వికెట్ కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ, మతీషా పతిరణ.

గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభ్‌మాన్ గిల్, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, మోహిత్ శర్మ, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, మహ్మద్ షమీ, జాషువా లిటిల్

డ్రీమ్ 11 టీమ్ టిప్స్ 

వికెట్ కీపర్: డేవాన్ కాన్వే
బ్యాట్స్‌మెన్: శుభ్‌మాన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), శివమ్ దూబే, సాయి సుదర్శన్
ఆల్‌రౌండర్లు: రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, మొయిన్ అలీ
బౌలర్లు: మహ్మద్ షమీ, రషీద్ ఖాన్ (వైస్ కెప్టెన్), మతీషా పతిరణ

Also Read: Palnadu Murder Case: కుమారుడి తల నరికిన తండ్రి.. ఊరంతా తిరుగుతూ హల్‌చల్  

Also Read: MP Avinash Reddy: ఎంపీ అవినాష్ రెడ్డికి ఊరట.. అప్పటివరకు నో అరెస్ట్   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News