పవన్‌‌తో పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తించిన వైసీపీ.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆయనపై ఎదురుదాడి కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా టీడీపీ కూడా పవన్‌కు కౌంటర్ ఇవ్వడం మొదలెట్టింది. దీనికి ఎమ్మెల్యే అనిత శంఖారావం పూరించారు. పవన్ విమర్శలపై ఎమ్మెల్యే అనిత స్పందిస్తూ... పవన్ తన దృష్టికి వచ్చిన సమస్యలను  ప్రస్తావిస్తే.. వాటిని పరిష్కరిస్తానని చంద్రబాబు చెప్పారని...అయినప్పటికీ  పవన్ పనిగట్టుకొని చంద్రబాబుపై  విమర్శలు చేయడం శోచనీయమన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 పవన్‌కు అవగాహన లేదు..


ప్రజా సమస్యలపై ఏ మాత్రం అవగాహన లేని పవన్ పనిగా పెట్టుకొని టీడీపీపై విమర్శలు గుప్పించడం ఏంటని ప్రశ్నిస్తూ ఆమె ఎదురుదాడి మొదలెట్టారు. 2019 ఎన్నికల తరువాత ఎవరు ప్రజా నాయకులవుతారన్న విషయాన్ని ప్రజలే తేలుస్తారని టీడీపీ మహిళా ఎమ్మెల్యే  అనిత పేర్కొన్నారు..


గేర్ మార్చిన టీడీపీ...


తొలుత ప్రభుత్వ ఓటు బ్యాంకును చీల్చేందుకు దోహదపడతాడని భావించి పవన్ విషయంలో టీడీపీ మౌనం వహిస్తూ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అయితే పవన్ పై వైసీపీ కౌంటర్ మొదలెట్టింది. ఇక నుంచి పవన్ ప్రభుత్వంపై చేసే విమర్శలు వైసీపీకి లాభం కల్గేలా ఉన్నాయని గుర్తించిన టీడీపీ తన వ్యూహాన్ని మార్చుకొని పవన్ పై ఇలా కౌంటర్ మొదలెట్టింది. దీంతో ఏపీ రాజకీయాలు మరింత హాట్‌గా మారాయి.