టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్‌పై కేసు నమోదు
లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమించిన నేరం కింద టీడీపీ నేతలు ఇలా కేసులో ఇరుక్కోవడం ఇటీవల ఇది రెండోసారి. ఇదివరకే లాక్‌డౌన్ రూల్స్ ఉల్లంఘించారని టీడీపీ ఎంపీ కేశినేని నానిపై క్రిష్ణా జిల్లా పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
ఉయ్యూరు: టీడీపీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌పై ఉయ్యూరు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. టీడీపీ స్థానిక నేతలు, కార్యకర్తలతో కలిసి నిత్యవసరాలు, కూరగాయలు పంపిణి చేసే క్రమంలో ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ లాక్‌డౌన్ రూల్స్ ఉల్లంఘించారనే ఆరోపణల కింద ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాజేంద్రప్రసాద్‌తో పాటు మరో 9 మంది అనుచరులపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. లాక్‌డౌన్ సమయంలో సోషల్ డిస్టన్స్ నిబంధనను విధిగా పాటించాల్సి ఉందని.. కానీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ ఆయన అనుచరగణంతో కలిసి వచ్చి ఇక్కడ జనం గుమికూడేందుకు కారకుడయ్యారని.. అందుకే ఆయనపై కేసు నమోదు చేశామని ఉయ్యూరు పోలీసులు తెలిపారు.
Also read : మద్యం విక్రయాలు.. మందు బాబులకు కండిషన్స్
లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమించిన నేరం కింద టీడీపీ నేతలు ఇలా కేసులో ఇరుక్కోవడం ఇటీవల ఇది రెండోసారి. ఇదివరకే లాక్‌డౌన్ రూల్స్ ఉల్లంఘించారని టీడీపీ ఎంపీ కేశినేని నానిపై క్రిష్ణా జిల్లా పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..