అమరావతి: దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి నిర్మూలనలో భాగంగా లాక్ డౌన్ విధించి నేటికీ 18రోజులు గడిచినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన ముఖ్యమంత్రుల వీడియో సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా అన్నీ రాష్ట్రాల సీఎంలు లాక్ డౌన్ పొడగించాలని సూచించారు. అయితే ఏపీ ముఖ్యమంత్రి జగన్ కూడా పాల్గొన్నారు. దీనిపై టీడీపీ నేత శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు తీవ్రస్థాయిలో స్పందిస్తూ.. ఇతర రాష్ట్రాలలో సీఎంలు నిత్యం ప్రజలతో మాట్లాడుతూ వారిలో ఆత్మవిశ్వాసం నింపేందుకు ప్రయత్నిస్తుంటే, ఆంధ్రప్రదేశ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రజలకు బాసటగా నిలిచే పరిస్థితి లేదని విమర్శించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read Also: 15 రోజులు లాక్ డౌన్ పొడగింపు..?


మరోవైపు ముఖ్యమంత్రుల సమావేశంలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని, కరోనా మహమ్మారి వ్యాప్తి దాని సంక్రమణ నివారణకై జాగ్రత్తలు తీసుకోవడం పట్ల సరైన ప్రణాళిక లేకుండా ప్రధానితో మాట్లాడారని ఆరోపించారు.రాష్ట్రంలో లాక్ డౌన్ కొన్ని జోన్లకే పరిమితం చేయాలని ప్రధానితో అనడం బాధ్యతా రహితమని, ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు సైతం అదేవిధంగా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కరోనా వ్యాప్తి తీవ్రంగా ప్రబలుతున్న నేపథ్యంలో సామాన్య ప్రజలు మాస్కులు కావాలని మొరపెట్టుకుంటుంటే మంత్రులు అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం లాక్ డౌన్ కొనసాగిస్తే సామాన్యుడి మనుగడకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..