ఊహించిందే జరిగింది. మరో 15 రోజులు లాక్ డౌన్ పొడగిస్తూ కేంద్ర ప్రభుత్వం సూచనప్రాయంగా నిర్ణయం తీసుకుంది. ఈ రోజు ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం ఉంది.
ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన తర్వాత ప్రధాని మోదీ.. మరో 15 రోజులు లాక్ డౌన్ పొడగించే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తుందని చెప్పారు. తుది నిర్ణయాన్ని త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. ఐతే ఈ రోజు సీఎంల కాన్ఫరెన్స్ లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి లాక్ డౌన్ పొడగింపునకే ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది.
PM has taken correct decision to extend lockdown. Today, India’s position is better than many developed countries because we started lockdown early. If it is stopped now, all gains would be lost. To consolidate, it is imp to extend it
— Arvind Kejriwal (@ArvindKejriwal) April 11, 2020
ప్రధాని నరేంద్ర మోదీ సరైన నిర్ణయమే తీసుకున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. చాలా ముందస్తుగా లాక్ డౌన్ నిర్ణయం తీసుకోవడం వల్ల చాలా అభివృద్ధి చెందిన దేశాల కంటే ఇండియా పరిస్థితి మెరుగ్గా ఉందని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో లాక్ డౌన్ ఎత్తేయడం మంచిది కాదన్నారు. దీన్ని మరిన్ని రోజులు పొడగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఒకవేళ లాక్ డౌన్ ఎత్తేస్తే .. ఇప్పటి వరకు చేసిన ప్రయత్నం వృధా అవుతుందన్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో లాక్ డౌన్ పొడగించడమే మేలని ట్వీట్ చేశారు.
లాక్ డౌన్ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ చాలా పట్టుదలగా ఉన్నారని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యెడ్యూరప్ప అన్నారు. మరో 15 రోజులపాటు లాక్ డౌన్ విధించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాయని తెలిపారు. మరో ఒకటి రెండు రోజుల్లో దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర విడుదల చేస్తుందని చెప్పారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..