ఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభల్లో మరోమారు ప్రత్యేక హాదా నినాదం మర్మోగింది. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలన్నీ నెరవేర్చాలని కోరుతూ  లోక్ సభలో టీడీపీ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అనేక మార్లు స్పీకర్ పోడియం వద్దకు వచ్చి ప్లకార్డుల ప్రదర్శించారు. ఎంతగా వారించినప్పటికీ సభ్యులు వెనక్కి తక్కకపోవడంతో స్పీకర్ ఆగ్రహించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీడీపీ ఎంపీలను సభ నుంచి నాలుగు రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. దీంతో టీడీపీ సభ్యులు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, తోట నరసింహన్, మరళీ మోహన్, బుట్టా రేణుక, అవంతి శ్రీనివాస్ , మాంటి బాబు, జేసీ దివాకర్ రెడ్డి, శ్రీరాం మాల్యాద్రి, అశోక్ గజపతి రాజు, కొనగళ్ల నాయణ సస్పెన్షన్ కు గురయ్యారు.


సభా కార్యకలాపాలకు ఆటంకం కల్గిస్తుందునే సస్పెండ్ చేయాల్సి వచ్చిందని స్పీకర్ వివరణ ఇచ్చారు..మరోవైపు టీడీపీ ఎంపీలు స్పీకర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సమస్యలపై గళం విప్పితే సభ నుంచి బయటికి గెంటేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 


గత కొన్ని రోజుల నుంచి ప్రత్యేక హోదా కోసం ఆంద్రప్రదేశ్ ఎంపీలు సభ లోపల బయట పోరాడుతున్న విషయం తెలిసిందే. వైసీపీ ఎంపీలు రాజీనామా చేసిన నేపథ్యంలో సభ వెలుపల తమ నిరసన వ్యక్తం చేస్తుండగా..టీడీపీ సభ లోపల..భయట విభజన హామీలపై మోడీ సర్కార్ తీరును ఎండగడుతూ వస్తోంది.