టీడీపీ సరికొత్త ఎత్తుగడ ; వైసీపీని ఇరుకున పెట్టే అస్త్రం సిద్ధం
వైసీపీ, బీజేపీలను ఏకాకి చేసే వ్యహాన్ని చంద్రబాబు సిద్ధం చేశారు.
అనేక రాజకీయల పరిణామాల మధ్య వైసీపీ -బీజేపీ దగ్గరౌతున్న తరుణంలో వీరిద్దరి దోస్తీకి చెక్ పెట్టేందుకు టీడీపీ సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించనుంది. దీని కోసం అవిశ్వాసం అంశాన్ని తెరపైకి తెచ్చింది. కేంద్రంపై అవిశ్వాసం ప్రవేశపెడతామని చెప్పి డైలమాలో ఉన్న వైసీసీకి దాన్ని అమలు చేసే విధంగా ఒత్తిడి తేవాలని టీడీపీ నిర్ణయించినట్లు సమాచారం. గురువారం రాష్ట్ర మంత్రులతో పాటు పార్టీ కీలక నేతలతో సుదీర్ఘమంతనాలు జరిపిన టీడీపీ అధినేత చంద్రబాబు ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఒక్క దెబ్బకు రెండు పిట్టలు
వైసీపీ చేత ఒక్కసారి అవిశ్వాసం ప్రవేశపెట్టేలా చేస్తే భవిష్యత్తులో వైసీపీ-బీజేపీ దోస్తీ సాధ్యం కాదు. అవిశ్వాసం అనే అస్త్రంతో వైసీపీ-బీజేపీల బంధం బలపడకుండా నియంత్రించాలనేది టీడీపీ వ్యూహం. ఫలితంగా బీజేపీ, వైసీపీలకు ఏకాకిని చెయవచ్చు. ఇలా ఒక్క దెబ్బకు రెండు పిట్టలు రాలే వ్యూహాన్ని రచిస్తోంది టీడీపీ.
బీజేపీతో వైసీపీ దోస్తీ చేస్తే ..
అవిశ్వాసాన్ని కాదని.. బీజేపీతో దోస్తీ చేస్తామని జగన్ ప్రకటిస్తే ప్రజా క్షేత్రంలో వైసీపీకి ఇబ్బందులు తప్పవనేది టీడీపీ అంచనా. అప్పుడు బీజేపీ, వైసీపీలను ప్రత్యేక హోదా ద్రోహులగా చిత్రీకరించవచ్చనేది టీడీపీ వ్యూహం. మొండి ధైర్యంతో జగన్ ఆ పని చేస్తే ప్రజా కోర్టులో దోషిగా నిలబెట్టవచ్చనేది చంద్రబాబు వ్యూహం. వైసీపీ, బీజేపీ కలిసి పోటీ చేసినా వారిని ప్రజలు వారిని నమ్మే పరిస్థితి ఉండకపోవచ్చు .
టీడీపీ ద్విముఖ వ్యూహం
అవిశ్వాసం పేరుతో టీడీపీ ఇలా ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. అందుకే వైసీపీ ప్రవేశపెట్టబోయే అవిశ్వాస తీర్మానంపై మద్దతు ఇవ్వాలని టీడీపీ నిర్ణయించింది. ఈ సమయంలో వైసీపీ వెనకడుగు వేస్తే టీడీపీయే కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశముంది. ఇలా ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అనే వ్యహాన్ని చంద్రబాబు రచిస్తున్నారు. దీనిపై వైసీపీ ఏమేరకు స్పందిస్తుందనేని హాట్ టాపిక్ గా మారింది