Chandrababu: ఏపీలో అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈక్రమంలోనే భీమవరంలో ప్రధాని మోదీ చేత ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈనేపథ్యంలో అల్లూరి సేవలను టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు స్మరించుకున్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలను దేశవ్యాప్తంగా జరుపుకోవడం గర్వకారణమన్నారు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తన జీవితమంతా పోరాటంలోనే అల్లూరి గడిపారని తెలిపారు. చిన్న వయసులోనే బ్రిటిష్‌ వారిని గడగడలాడించారని..ఆయనను చంపేందుకు బ్రిటిష్‌ ప్రభుత్వం రూ.40 లక్షలు ఖర్చు పెట్టిందని గుర్తు చేశారు. ఉత్సవాల నిర్వహణకు కేంద్రం ముందుకు రావడం శుభపరిణామన్నారు. ప్రధాని నిర్ణయాన్ని పార్టీపరంగా స్వాగతిస్తున్నామన్నారు. పార్లమెంట్‌లో అల్లూరి విగ్రహం ఏర్పాటు చేయాలని చంద్రబాబు కోరారు. 



Also read:Sharad Pawar: మహా'డ్రామా' మళ్లీ మొదలయ్యేనా..ఏక్‌నాథ్‌ వర్గంపై శరద్‌ పవార్ ఏమన్నారంటే..!


Also read:TS Police Jobs: తెలంగాణలో పోలీస్ అభ్యర్థులకు అలర్ట్..పరీక్షల షెడ్యూల్‌ ఇదే..!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook