PM Modi: యావత్ భారతానికి మన్యం వీరుడు, తెలుగు జాతి యుగ పురుషుడు అల్లూరి సీతారామరాజు ఆదర్శమన్నారు ప్రధాని మోదీ. అల్లూరి జయంతి ఉత్సవాల సందర్భంగా మనమంతా ఇక్కడ కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెద అమిరంలో 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం భారీ బహిరంగసభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. తెలుగులో ప్రసంగం మొదలు పెట్టిన మోదీ తెలుగు వీర లేవరా..దీక్షబూని సాగరా అంటూ విప్లవ గీతాన్ని గుర్తు చేశారు.
ఆంధ్ర రాష్ట్రం పుణ్య భూమి, వీర భూమి అని అన్నారు. ఇక్కడికి రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. అల్లూరి ప్రారంభించిన ఉద్యమానికి నేటికి వందేళ్లు పూర్తైయ్యిందన్నారు. అలాంటి మన్యం వీరుడికి 125వ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. ఆయనకు యావత్ భారతదేశం వందనం చేస్తోందన్నారు మోదీ. ఆదివాసీల కోసం అల్లూరి ఎంతో చేశారని గుర్తు చేశారు.
అల్లూరి సీతారామ రాజు కుటుంబసభ్యులను కలవడం సంతోషంగా ఉందన్నారు ప్రధాని మోదీ. తెలుగు నేల నుంచి ఎంతో మంది మహానుభావులు దేశం కోసం పనిచేశారని చెప్పారు. మనమంతా ఒకటే అన్న భావనతో స్వాతంత్ర ఉద్యమం జరిగిందన్నారు. ఆదివాసీ సంగ్రహాలయాలను అల్లూరి మెమోరియల్ మ్యూజియంలో ఏర్పాటు చేస్తామన్నారు. ఇదే నేలపై ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి తిరుగుబాటు చేశారని తెలిపారు మోదీ.
Also read:Roja Selfie with Modi: ప్రధాని మోడీ సభలో మంత్రి రోజా హల్చల్.. ఏం చేసిందో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook