Chandrababu Naidu Released India Vision 2047 Document: విశాఖపట్నంలో ఇండియా విజన్ 2047 డాక్యుమెంట్ విడుదల కార్యక్రమంలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశం కోసం విశాఖలో విజన్ డాక్యుమెంట్ విడుదల చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు. ఒక విజన్ ద్వారా పని చేస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయని.. దేశంలో ఫ్రీ ఫ్రం కరెప్షన్, ఫ్రీ ఫ్రం క్రైం అనేది సాక్షాత్కారం కావాలని పిలుపునిచ్చారు. దేశంలో అనేక సంస్కరణలు తెచ్చిన వారు నాటి ప్రధాని పీవీ నరసింహారావు అని.. ఆయన ఆర్థిక సంస్కరణ వల్లే సంపద సృష్టి అవుతోందన్నారు. అయితే ఆ సంపద కొందరికే పరిమితం అవుతోందని.. అందుకే పేదరికం లేని సమాజం కోసం ఒక విజన్ అవసరమని అన్నారు. దానికోసమే విజన్ 2047 కు రూపకల్పన చేసినట్లు చంద్రబాబు తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రపంచంలో భారతీయులు శక్తివంతమైన జాతిగా ఉన్నారన్న చంద్రబాబు.. వారిలో తెలుగు వారు ముందున్నారని చెప్పారు. ప్రతి వ్యక్తికి.. ప్రతి పౌరుడికి విజన్ ఉంటుందని.. తన పిల్లలను ఎలా చదివించాలి..? ఎలా తీర్చిదిద్దాలి అని ఆలోచిస్తారని అన్నారు. దాని కోసం ప్రణాళికలు రూపొందిస్తారని.. అలాగే దేశానికి కూడా విజన్ ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దీనిలో భాగంగానే ఇండియా, ఇండియన్స్, తెలుగూస్ అని విజన్‌ను రూపొందించినట్లు వెల్లడించారు. 2047 నాటికి భారత్ ప్రపంచ నెంబర్ 1 ఆర్థిక శక్తిగా మారాల్సిన అవసరం ఉందని చెప్పారు. డ్రాఫ్ట్ విజన్‌ను ప్రజల ముందుకు తీసుకువస్తున్నానని. దీనిపై మేథావులు, నిపుణులు స్పందించి.. తమ సూచనలు సలహాలు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా ఐదు స్ట్రాటజీలను వెల్లడించారు.


ఇక వచ్చే ఎన్నికల్లో ఎన్టీయే కూటమిలో టీడీపీ చేరుతుందనే ఊహగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై చంద్రబాబును ప్రశ్నించగా.. ఇది సరైన సమయం కాదని అన్నారు. ఎన్‌డీఏ ప్రభుత్వంలో చేరడం గురించి మాట్లాడేందుకు ఇది సమయం కాదని.. తానే సరైన సమయంలో ఈ విషయం గురించి మాట్లాడతానని చెప్పారు. మంగళవారం సాయంత్రం పోర్టు సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజన్-2047 డాక్యుమెంట్‌ను విడుదల చేసిన అనంతరం ఆయన ANIతో మాట్లాడారు. 


2024లో జాతీయ రాజకీయాల్లో తన పాత్ర చాలా స్పష్టంగా ఉంటుందని చంద్రబాబు అన్నారు. "నా ప్రాధాన్యత ఆంధ్రప్రదేశ్. ఇది నా పెద్ద ఎజెండా. రాష్ట్ర పునర్నిర్మాణం, పునర్నిర్మాణానికి సిద్ధమవుతాను. అంతా ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచ స్థాయి రాజధానిని ప్లాన్ చేశాం. నేను క్రమపద్ధతిలో తొమ్మిదేళ్లుగా హైదరాబాద్‌కు అత్యుత్తమ పర్యావరణ వ్యవస్థలు ఏర్పాటు చేశాను." అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. 


Also Read: AP Politics: వచ్చే ఎన్నికల్లో పోటీపై బాలినేని ప్రకటన.. జగన్ గ్రీన్‌సిగ్నల్ ఇస్తారా..?  


Also Read: Shilpa Shetty: చెప్పులు ధరించి జాతీయ జెండాను ఎగురవేసిన శిల్పాశెట్టి.. నెట్టింట ట్రోలింగ్  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook