Shilpa Shetty: చెప్పులు ధరించి జాతీయ జెండాను ఎగురవేసిన శిల్పాశెట్టి.. నెట్టింట ట్రోలింగ్

Shilpa Shetty in Independence Day 2023 Celebrations: బాలీవుడ్ నటి శిల్పాశెట్టిపై నెట్టింట భారీ ట్రోలింగ్ జరుగుతోంది. చెప్పులు ధరించి.. జాతీయ జెండాను ఆవిష్కరించడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ట్రోలర్స్‌కు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు శిల్పాశెట్టి.  

Written by - Ashok Krindinti | Last Updated : Aug 16, 2023, 07:58 AM IST
Shilpa Shetty: చెప్పులు ధరించి జాతీయ జెండాను ఎగురవేసిన శిల్పాశెట్టి.. నెట్టింట ట్రోలింగ్

Shilpa Shetty in Independence Day 2023 Celebrations: దేశవ్యాప్తంగా ఇండిపెండెన్స్ వేడుకలు భారీగా జరిగాయి. ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ జెండాను ఎగురవేసి.. జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. దేశవ్యాప్తంగా వీధివీధినా మువ్వన్నెలా జెండా రెపరెపలాడింది. భారత్‌ మాతాకి జై.. అంటూ దేశ ప్రజలు నినదించారు. నటి శిల్పాశెట్టి కుంద్రా కూడా స్వాతంత్ర్య దినోవత్స వేడుకలను జరుపుకున్నారు. భర్త రాజ్ కుంద్రా, కుమారుడు వియాన్, కుమార్తె సమీషా, తల్లి సునంద శెట్టితో సహా తన కుటుంబ సభ్యులతో కలిసి ఇండిపెండేన్స్ డే వేడుకల్లో పాల్గొన్నారు. అయితే చెప్పులు ధరించి జాతీయ జెండాను ఎగురవేయడంపై నెటిజన్లు ఆమెపై ఫైర్ అవుతున్నారు.

మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లోకి  తన కుటుంబ సభ్యులు, సిబ్బందితో కలిసి జాతీయ జెండాను ఎగురవేసిన వీడియోను షేర్ చేశారు. శిల్పా తెల్లటి కుర్తాలో ఆకుపచ్చ సల్వార్ బాటమ్, నారింజ దుపట్టాతో జత చేసిన డ్రెస్‌ ధరించింది. తన పిల్లలు, భర్తతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. "వందేమాతరం #జైహింద్ #స్వాతంత్ర్యదినోత్సవం #76 సంవత్సరాల స్వాతంత్ర్యం #ప్రౌడ్ఇండియన్ అంటూ వీడియోను షేర్ చేసుకుంటూ శిల్పా క్యాప్షన్ ఇచ్చారు. 

అయితే ఈ పోస్ట్‌ను షేర్ చేసిన తర్వాతగానీ ఆమెకు చేసిన తప్పు తెలిసిరాలేదు. జాతీయ జెండాను ఎగురవేసేటప్పుడు చెప్పులు ధరించడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రోలర్స్ రెచ్చిపోతున్న క్రమంలో శిల్పా తన ఇన్‌స్టాగ్రామ్‌లో వివరణ ఇచ్చారు. "జెండాను ఎగురవేసేటప్పుడు ప్రవర్తనా నియమాలపై నాకు అవగాహన ఉంది. నా దేశం, జెండా పట్ల ఉన్న గౌరవాన్ని చూడండి. ప్రశ్నించడం కాదు. నేను భారతీయురాలుగా గర్విస్తున్నా. ఈ రోజు సంబురాలు చేసుకోవడం ఓ భావోద్వేగం. నెగిటివిటీని స్ప్రెడ్ చేయడానికి కాదు. వాస్తవాలను తెలుసుకోండి. ఇలాంటివి ఆపివేయండి." అని పోస్ట్ పెట్టారు.  

 

కాగా కొంతమంది శిల్పా శెట్టికి మద్దతుగా నిలుస్తున్నారు. ఇండిపెండెన్స్ డే అనగానే హాలీ డే అనుకుని నిద్రపోతున్న వారికంటే శిల్పా ఎంతో నయమని అంటున్నారు. జెండా ఎగురవేయని వారు.. జెండాకు వందనం చేయని వారే ఇలాంటి పనికిమాలిన ట్రోల్స్ చేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఇవన్నీ పట్టించుకోకండి మేడమ్.. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని చెబుతున్నారు.

Also Read: Independence Day Celebrations: అన్ని సేవలు ఇంటి వద్దకే.. గ్రామ స్వరాజ్యం తీసుకువచ్చాం: సీఎం జగన్   

Also Read: Wanindu Hasaranga: స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగా సంచలన నిర్ణయం.. టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌ బై..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News