Chandrababu Naidu: జగన్ అన్న బాణం రివర్స్ గేర్.. వైఎస్సార్సీపీ ఇంటికే: చంద్రబాబు
Chandrababu Naidu on CM Jagan: సొంత బాబాయ్ వైఎస్ వివేకా హత్యపై మాట్లాడే దమ్ము సీఎం జగన్‌కు ఉందా..? టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. జగన్‌కు బాబాయ్ ప్రాణాలే లెక్కలేదని.. ఇక మనం ఓ లెక్కా అని అన్నారు. కడప జిల్లాలో ఆయన పర్యటిస్తున్నారు.
Chandrababu Naidu on CM Jagan: కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో టీడీపీ రా కదలిరా బహిరంగ సభలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు హాట్ కామెంట్స్ చేశారు. కడపలో ఇంతమంది తరలి వచ్చారంటే కడప గడపలో జగన్ పని అయిపోయిందన్నారు. జగన్ పోవాలి రాష్ట్రం బాగుపడాలని అన్నారు. కడపలో ఎవరికైనా న్యాయం జరిగిందా..? ఒక్క జగన్‌కే న్యాయం జరిగిందన్నారు. కడప స్టీల్ ప్లాంట్ లేదు.. ఇరిగేషని ప్రాజెక్టులు లేవన్నారు. కమలాపురంలోనే ఇంత స్పందన వచ్చిందంటే పులివెందులలో కూడా టీడీపీదే విజయమని జోస్యం చెప్పారు. పులివెందుల ప్రజలే జగన్‌ను గెలిపించినందుకు బాధపడుతున్నారని అన్నారు. కడపలో కరువు వచ్చినా కరువు ప్రాంతాలను ప్రకటించలేదన్నారు. తాను అధికారంలో ఉండి ఉంటే కరువు ప్రాంతాలను ప్రకటించి న్యాయం చేసేవాడినని చెప్పారు.
"వివేకా హత్య రోజు జగన్ కొత్తనాటకం ఆడాడు. వివేకా హత్యపై జగన్‌కు మాట్లాడే దమ్ము ఉందా..? బాబాయే లెక్కలేకపోతే జగన్‌కు మనం ఒక లెక్కా..? తప్పు చేయని కోడి కత్తి శ్రీను జైలులో ఉంటాడు. కానీ కడప ఎంపీ మాత్రం బయట తిరుగున్నాడు. హంతకులు అరెస్టు కారు.. కానీ నిర్దోషులు బయట తిరుగుతారు. రేపు మిమ్మలను చంపినా నన్ను చంపినా దిక్కులేదు.. ఒక హంతకుడికి కడప ప్రజలు ఓటు వేస్తారా..? మీ సహకారం కోసం వచ్చాను. సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుక, రంజాన్ తోఫా, అన్నా క్యాంటీన్ ఇవన్నీ ఏమాయ్యాయి..? జగన్ బటన్ నొక్కడం కాదు.. బటన్ బొక్కడం.
ఇసుక నుంచి తాలం తీసే రకం వీళ్లు. భవన కార్మికుల పొట్టకొట్టి జగన్ కడుపు నింపుతున్నారు. నేను ఉన్నప్పుడు క్యాలిటీ మద్యం ఇచ్చాం.. ఇప్పుడు నాసిరకం మద్యం అధిక ధరలకు అమ్ముతున్నారు. అది తాగితే ఆరోగ్యం గోవిందా.. గోవిందా.. జగన్ మందు బాబులను అందరినీ మోసం చేశాడు. పన్నులు పెరిగాయి.. రేట్లు పెరిగాయి. సుపరిపాలన ఇస్తానని చెప్పి అన్నింటిపై రేట్లు పెంచేశాడు. సమైక్యాంధ్రలో 1998లో విద్యుత్‌లో సంస్కరణలు తెచ్చాను. కరెంట్ ఛార్జీలను తొమ్మిది సార్లు పెంచాడు.
రైతుల మోటార్లకు మీటర్లు పెట్టిన అసమర్థడు జగన్. కడప స్టీల్ ప్లాంట్‌కు రెండుసార్లు రిబ్బన్ కట్ చేశాడు. రాయలసీమకు ఇంతవరకు ఎంతఖర్చు పెట్టాడో చెప్పగలరా..? గోదావరి నీళ్ళు బనకచర్లకు తీసుకురావడం నా కోరిక. ఇది జరిగితే రాలసీమ రతనాల సీమ అవుతుంది. రాబోయేది రైతురాజ్యమే.. 29 మంది దళిత ఎమ్మెల్యేలను ట్రాన్స్‌ఫర్ చేశాడు. భూరక్షణ చట్టం అందరికీ చేటు. మేము అధికారంలోకి వస్తే ఈ చట్టం అమలు చేయం. నంగనాచి మాటలు చెబుతూ.. ఒకచోట పనికిరాని ఎమ్మెలే వేరొక చోట పనికి వస్తాడా..? చెత్త ఎక్కడైనా చెత్తే .. వారికి మీరు ఓటేస్తారా..? చెల్లికి న్యాయం చేయలేని వాడు మనకు న్యాయం చేయగలడా..? జగన్ అన్న బాణం ఇప్పుడు రివర్స్ గేర్‌లో వస్తుంది.. వైఎస్సార్సీపీ ఇంటికే.." అని చంద్రబాబు అన్నారు.
Also Read: Lord Sri Ram Idol: అయోధ్య విగ్రహం.. రామయ్య నీరూపం చూడడానికి రెండు కళ్లు చాలవయ్యా
Also Read: Ram Mandir: అయోధ్యకు ప్రభాస్ 50 కోట్ల విరాళం…క్లారిటీ ఇచ్చిన టీమ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter