చిత్తూరు: సబ్జెక్ట్ తో పాటు దూకుడుతో వ్యవరించే  నేతలు వైసీపీలో ఎవరైనా ఉన్నారంటే..టక్కున వినిపించే పేరు రోజా.  తన సబ్జెక్ట్ తో పాటు దూకుడుతో అసెంబ్లీలో టీడీపీ ఇరుకున పెడుతున్న రోజా.... బయట కూడా అధికార పార్టీకి ఢీ అంటే ఢీ అనే స్థాయికి చేరారు. దీంతో రోజాను ఎలాగైన ఓడించాలని చంద్రబాబు గట్టిపట్టుదలతో ఉన్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గాలి మరణంతో అభ్యర్ధి కరవు..


గత ఎన్నికల్లో నగరి నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నేత గాలిముద్దుకృష్ణమనాయుడుపై రోజా స్వల్ప మెజార్టీతో మాత్రమే పొందారు. అయితే గాలి మరణం తర్వాత నియోజకవర్గంలో టీడీపీ పట్టుకోల్పోయిందనే టాక్ ఉంది. ఇదే క్రమంలో వైసీపీ అభ్యర్ధి రోజాకు నియోజకవర్గంలో ఎదురు లేకుండా పోయిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. గాలి వారసులు ఉన్నప్పటికీ ప్రస్తుతం వారి ఎదిగే స్థాయిలో ఉన్నారని చెబుతున్నారు.


గాలి వారసత్వ యుద్ధం..


గాలి ముద్దుకృష్ణమనాయుడు  మరణం తర్వాత ఆయన కుమారులు గాలి భానుప్రకాశ్.. గాలి జగదీష్ లు తండ్రి వాసరత్వాన్ని అందుకునేందుకు పోటీపడ్డారు. ఈ పోరు బహిర్గతం అయ్యే సరికి చంద్రబాబు చొరవతో వివాదం సర్దుణిగింది. కుటుంబసభ్యలతో చర్చించుకొని ఎవరో ఒకరు ముందుకు రావాలని..లేదంటే బయటి వ్యక్తి ఇన్ ఛార్జ్ బాధ్యతలు ఇస్తామనడంతో గాలి భానప్రకాశ్ సైలైంట్ అవ్వగా..గాలి జగదీష్ ను నగరి టీడీపీ ఇన్ ఛార్జ్ గా నియమించారు


తెరపైకి ఆశోక్ రాజు పేరు..


గత ఎన్నికల్లో నగరి టికెట్ కోసం ప్రయత్నించి విఫలమైన ఆశోక్ రాజు కూడా ప్రస్తుతం టికెట్ రేసులో నిలబడ్డారు. అప్పట్లో సీనియర్ అయిన గాలి ముద్దుకృష్ణమనాయుడు ఉండటంతో ఆయనకు టికెట్ దక్కలేదు.ఇప్పుడు ఆయన మరణించడంతో సీనియర్ అయిన తనకే టికెట్ ఇవ్వాలని ఆశోక్ రాజు పట్టుబడుతున్నారు. అయితే ఆయన రోజా లాంటి దూకుడున్న నేతను ఢీకొట్టగలరా అనేది ఇక్కడ ప్రశ్న...


అలా వచ్చి ఇలా వెళ్లిన వాణీ విశ్వనాథ్


సినీ గ్లామర్ ఉన్న రోజాను ..సీనీ గ్లామర్ తో నే ఢీకొట్టాలని ఉద్దేశంలో గతంలో ఇక్కడ వాణి విశ్వనాథ్ పేరును తెరపైకి తీసుకొచ్చారు.. అయితే సినీ గ్లామర్ తో పాటు సబ్జెక్ట్ పై మంచి పట్టుఉన్నను రోజాను ఓడించాలంటే సినీ గ్లామర్ ఒక్కటే సరిపోదని భావించి చంద్రబాబు వెనక్కి తగ్గారు. ప్రస్తుతం ఆ ఆలోచనను విరమించుకున్న తెలిసింది


ఇద్దరిలో ఎవరో ఒకరా..లేదంటే ఎవరో ఒకరా ?


ఇక టికెట్ రేసులో మిగిలింది.. గాలి జగదీష్ లు, ఆశోక్ రాజు మాత్రమే..  గాలి జగదీష్ కు టీడీపీ ఇన్ ఛార్జ్ అప్పగించినప్పటికీ టికెట్ కచ్చితంగా ఇస్తామనే గ్యారెంటీ ఇవ్వలేదు.. అలగని ఆశోక్ రాజుకు ఇస్తారా అంటే అదీ తేల్చలేదు..మిగిలిన నియోజకవర్గాల్లో అభ్యర్ధుల విషయంలో కచ్చితమైన అభిప్రాయంతో ఉన్న చంద్రబాబు ..ఇక్కడ మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లు సమాచారం.. అయితే ఈ నియోజకవర్గంలో ప్రస్తుతానికి అసంతృప్తి  లేకుండా చూసుకుంటున్నారు.. ఇప్పుడు  జగదీష్ లు, ఆశోక్ రాజు లలో ఎవరో ఒకరి టికెట్ ఇస్తారా లేదా అకస్మాత్తుగా కొత్త వ్యక్తిని తెరపైకి తెస్తారా అనే దానిపై ఉత్కంఠత నెలకొంది.