TDP Parliament Candidates List: బీజేపీకి షాక్ ఇస్తూ తెలుగు దేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్ధుల ప్రకటన..
TDP Parliament Candidates List: 2024 సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది. అటు ఆంధ్ర ప్రదేశ్‌లో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఏక కాలంలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే బీజేపీతో జట్టు కట్టకముందే టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్ధులను ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. తాజాగా టీడీపీ, జనసేన కూటమికి బీజేపీ జత కలిసింది. ఈ ముగ్గురు కలిసిన తర్వాత తాజాగా టీడీపీ 13 మంది ఎంపీ అభ్యర్ధులతో పాటు పలువురు ఎమ్మెల్యే కాండిడేట్స్ లిస్టును విడుదల చేసింది.
TDP Parliament Candidates List: 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలో ఉన్న వైయస్ఆర్సీపీని గద్దె దింపడానికి తెలుగు దేశం,జనసేన, బీజేపీ పార్టీలు ఒక కూటమిగా ఏర్పడ్డాయి. బీజేపీ కలవకు ముందు ఇప్పటికే టీడీపీ, జనసేన ఉమ్మడిగా తమ అభ్యర్ధుల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే కదా. బీజేపీలో అలయెన్స్ తర్వాత తెలుగు దేశం పార్టీ లోక్‌సభకు పోటీ చేసే 13 అభ్యర్ధుల జాబితాను విడుదల చేసింది...
1. శ్రీకాకుళం.. కింజారపు రామ్మోహన్ నాయుడు..
2. విశాఖ పట్నం.. మాత్కుమిల్లి భరత్..
3. అమలాపురం.. గంటి హరీష్
4. ఏలూరు.. పుట్టా మహేష్ యాదవ్
5.విజయవాడ: కేశినేని శివనాథ్ (చిన్ని)
6. గుంటూరు .. పెమ్మసాని చంద్రశేఖర్
7. నరసరావు పేట.. లావు శ్రీకృష్ణదేవరాయలు
8. బాపట్ల.. టి. కృష్ణప్రసాద్
9. నెల్లూరు..వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
10. చిత్తూరు.. దగ్గుమళ్ల ప్రసాద్ రావు
11. కర్నూలు .. బస్తిపాటి నాగరాజు
12. నంద్యాల.. బైరెడ్డి శబరి
13. హిందూపురం.. బీకే పార్ధసారథి
అయితే హిందూపురం ముందు నుంచి బీజేపీ కోరుకుంటుంది. అలాంటి సీటను ఇపుడు బీకే పార్ధసారథికి ఇవ్వడంపై భారతీయ జనతా పార్టీ గుర్రుగా ఉంది.
మరోవైపు టీడీపీ మూడో జాబితాలో 11 అసెంబ్లీకు అభ్యర్ధులకు ప్రకటించిన తెలుగు దేశం పార్టీ..
పలాస.. గౌతు శిరీష..
పాత పట్నం.. మామిడి గోవింద్ రావు
శ్రీకాకుళం.. గొండు శంకర్
శృంగవరపు కోట.. కోళ్ల లలిత కుమారి
కాకినాడ సిటీ.. వనమాడి వెంకటేశ్వరరావు
అమలాపురం.. అయితాబత్తల ఆనందరావు
పెనమలూరు.. బోడె ప్రసాద్
మైలవరం.. వసంత కృష్ణప్రసాద్
నరసరావు పేట.. చదలవాడ అరవింద్ బాబు
చీరాల.. మద్దులూరి మాల కొండయ్య
Also Read: Arvind Kejriwal: మద్యం కుంభకోణంలో అనూహ్య మలుపు.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్
Also Read: Kavitha Arrest: కవిత అరెస్ట్ వెనకాల ఉన్న కథ ఇదే.. ఢిల్లీ కుంభకోణం అంటే ఏమిటి?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter