తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ రోజు ఏపీలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పర్యటనలో విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు.  సీఎం కేసీఆర్‌ అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కనకదుర్గ అమ్మవారి ఆలయానికి వచ్చే ముందు సీఎం కేసీఆర్‌కు గన్నవరం ఎయిర్‌పోర్టులో ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్‌తో పాటు పలువురు నేతలు ఘనస్వాగతం పలికారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమ్మవారిని దర్శించుకున్న అనంతరం సీఎం కేసీఆర్‌.. తాడేపల్లిలోని జగన్‌ నివాసానికి బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ వెంట టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, రాజ్యసభ సభ్యులు సంతోష్‌ కుమార్‌, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌ రెడ్డి, మాజీ ఎంపీ వినోద్‌ ఉన్నారు. కాగా ఈ సంద్భంగా తన నివాసానికి వచ్చిన కేసీఆర్ కు ఏపీ సీఎం జగన్ ఘన స్వాగతం పలికారు. అనంతరం అందరూ కలిసి బోజనం చేశారు.


మధ్యాహ్నం భోజనం అనంతరం ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంలో కాలేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాలని  జగన్ కు కేసీఆర్ ఆహ్వానించారు. విజయవాడ నుంచి జగన్ నివాసానికి వెళ్తున్న సమయంలో మార్గమధ్యంలో ప్రకాశం బ్యారేజీ వద్ద తన వాహనం నుంచి కేసీఆర్ కిందకు దిగారు. బ్యారేజీని, నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణాన్ని ఆస్వాదించారు. సాయంత్రం ఇద్దరు సీఎంలు కలిసి ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యారు.