Prabhas-Pawan Kalyan: ప్రభాస్, పవన్ కళ్యాణ్ తో మల్టీస్టారర్.. సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేయనున్నారా?

OG Update: రన్ రాజా రన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దర్శకుడు సుజిత్. ఆ తరువాత సాహో సినిమా తీసిన ఈ డైరెక్టర్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఓజీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈ డైరెక్టర్ చేసిన కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 27, 2024, 12:19 PM IST
Prabhas-Pawan Kalyan: ప్రభాస్, పవన్ కళ్యాణ్ తో మల్టీస్టారర్.. సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేయనున్నారా?

OG: సుజిత్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. శర్వానంద్ హీరోగా చేసిన రన్ రాజా రన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు ఈ దర్శకుడు. మొదటి సినిమాతో మంచి విజయం సాధించి అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నారు. ఇక వెంటనే ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో ఫ్యాన్ ఇండియా సినిమా అవకాశం దక్కించుకొని అందరిని ఆశ్చర్యపరిచారు. ఇక ఈ డైరెక్టర్ కి తిరుగులేదు అని అందరూ అనుకున్నారు.

కానీ ప్రభాస్ తో సుజిత్ చేసిన సాహో సినిమా మాత్రం తెలుగులో పెద్దగా విజయం సాధించలేక పోయింది. హిందీలో ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర మంచిగా కలెక్షన్స్ తెచ్చుకున్న.. తెలుగులో మాత్రం ఫ్లాప్ గా నిలిచింది. ఇక ఈ దర్శకుడికి ఎవరూ పెద్దగా అవకాశాలు ఇవ్వరేమో అనుకుంటున్న టైంలో.. ఏకంగా పవన్ కళ్యాణ్ తో అవకాశం దక్కించుకున్నాడు. పవన్ కళ్యాణ్ తో ఓజి అనే చిత్రంతో త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకి రానున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

తాజాగా సుజీత్ కార్తికేయ హీరోగా చేస్తున్న భజే వాయువేగం సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు. ఈ ప్రమోషన్స్ లో పవన్ కళ్యాణ్ OG గురించి కూడా మాట్లాడాడు. అలాగే ఓ ఆసక్తికర కామెంట్ చేసాడు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్ తెగ వైరల్ అవుతుంది.

సుజీత్ మాట్లాడుతూ.. కుదిరితే పవన్ కళ్యాణ్, ప్రభాస్ లతో ఓ మల్టీస్టారర్ సినిమా చేయాలి అనేది నా కోరిక అని తెలియజేశాడు. దీంతో ప్రభాస్ సాహో సినిమాకు, పవన్ OG సినిమాకు లింక్ ఇచ్చే అవకాశం ఉంది అని.. సుజిత్ మల్టీ యూనివర్స్ ఫార్మ్ చేయొచ్చు అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. 

అంతేకాదు ఈ వీడియో కింద ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరి కాంబోలో సినిమా సెట్ చెయ్..ఫ్యాన్స్ అంతా నీకు రుణపడి ఉంటారు అని ప్రభాస్, పవన్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి నిజంగానే ప్రభాస్, పవన్ కళ్యాణ్ కాంబోలో మల్టీస్టారర్ సినిమా వస్తే కచ్చితంగా ఆ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది అన్నడం లో ఎటువంటి సందేహం లేదు.

Read more: Bhootonwala mandir: ఒక్క రాత్రిలో దెయ్యాలు కట్టిన ఆలయం.. దీని విశిష్టతో ఏంటో తెలుసా..?

Read more: Snakes facts: ప్రపంచంలోనే అత్యంత స్పీడ్ గా వెళ్లే పాములు.. ఇవి చాలా డెంజర్ భయ్యా.. డిటెయిల్స్ ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News