కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై రేవంత్ రెడ్డి స్పందించారు. లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం మీడియాతో  రేవంత్‌  మాట్లాడుతూ  బడ్జెట్ కేటాయింపుల్లో ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు కేంద్రం తీరని అన్యాయం చేసిందని విమర్శించారు. తెలుగు రాష్ట్రాలకు అరకొని నిధులు తప్పితే ఏమీ ఇవ్వలేదని మండిపడ్డారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు ఎలాంటి సహాయం అందించలేదని విమర్శించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మన మంత్రే మనకు అన్యాం చేశారు


మన తెలుగు రాష్ట్రాలతో పాటు  దక్షిణాదిపై కేంద్రం వివక్ష చూపిందని టి.కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు.  ఉత్తర్‌ప్రదేశ్‌ కేంద్రానికి రూ.1 పన్ను చెల్లిస్తే తిరిగి వారికి రూ.2 చొప్పున చెల్లిస్తున్నారు. అదే బీహార్ విషయంలో ఆ రాష్ట్రం రూ.1 పన్ను ఇస్తే తిరిగి రూ.1 ఇస్తున్నారన్నారు.  దక్షిణాది రాష్ట్రాలు రూ.1 పన్ను చెల్లిస్తే 65 పైసలే ఇస్తున్నారని రేవంత్ ఆరోపించారు. ఇలా ఉత్తరాది రాష్ట్రాలకు మాత్రమే న్యాయం చేస్తూ దక్షణాది రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం చేస్తోందని రేవంత్ రెడ్డి దయ్యబట్టారు. కేంద్ర ఆర్థిక మంత్రి దక్షిణాదికి చెందిన వారైనా ప్రధాని మోదీ చేతిలో కీలుబొమ్మే అని రేవంత్‌ ఘాటుగా వ్యాఖ్యానించారు. 


మధ్యతరగతిపై పెను భారం


బడ్జెట్ లో పొందుపరిచిన ఆదాయపన్ను విధానంపై రేవంత్ స్పందిస్తూ  పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం లేదని విమర్శించారు. పన్నుబాదుడులో మధ్యతరగతి వారు ఉలిక్కి పడే పరిస్థితి తెచ్చరాని విమర్శించారు. అలాగే బడ్జెట్‌లో విద్య, ఉద్యోగాలకు ప్రోత్సాహం అందించే ఎలాంటి పథకాలూ లేవని తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి విరమ్శించారు.