Erra Gangireddy Bail: వివేకా హత్య కేసులో కీలక మలుపు.. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు
Telangana High Court Cancels Erra Gangireddy Bail: ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. వివేకా హత్య కేసులో ఏ1గా ఉన్న గంగిరెడ్డి బయట ఉంటే.. సాక్షులను ప్రభావితం చేస్తున్నారని కోర్టులో సీబీఐ వాదించింది. సీబీఐ వాదనలతో హైకోర్టు ఏకీభవించింది.
Telangana High Court Cancels Erra Gangireddy Bail: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో మరో కీలక మలుపు చోటు చేటుచేసుకుంది. ఈ కేసులో ఏ1 నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. మే 5లోగా సీబీఐ కోర్టు ముందు లొంగిపోవాలని ఆదేశించింది. జూలై 1న దర్యాప్తు పూర్తి చేసి గంగిరెడ్డికి బెయిల్ మంజూరు చేయాలని సీబీఐ కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. జూన్ 30వ తేదీ వరకు మాత్రమే గంగిరెడ్డి బెయిల్ రద్దు చేసింది. రూ.లక్షన్నర షూరిటీలతో బెయిల్ ఇవ్వాలని సూచించింది. 2019 అక్టోబర్‌లో పులివెందుల కోర్టు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
వివేకా హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డి ప్రధాన నిందితుడని.. సాక్షులను ఆయన బెదిరించారని సీబీఐ కోర్టుకు తెలిపింది. కీలక నిందితుడు బయట ఉంటే.. కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుందని పేర్కొంది. సీబీఐ వాదనతో సునీత తరుఫు లాయర్లు ఏకీభవించారు. వివేకా హత్య కేసు విచారణ కీలక దశలో ఉందని సీబీఐ చెప్పింది. సీబీఐ వాదనలతో ఏకీభవించిన కోర్టు.. ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేసింది. మే 5లోగా సీబీఐ కోర్టులో లొంగిపోవాలని గంగిరెడ్డిని ఆదేశించారు. మరోవైపు సీబీఐ అధికారులు వివేకా హత్య కేసులో దూకుడు పెంచారు. పులివెందులలో వివేకా పీఎ కృష్ణారెడ్డికి మరోసారి వెళ్లారు. కృష్ణారెడ్డితోపాటు మరికొందరికి నోటీసులు జారీ చేశారు.
వివేకా హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డిని ఏ1 నిందితుడిగా సిట్ చేర్చింది. అయితే అప్పటి ఛార్జీషీట్‌ను 90 రోజుల్లో దాఖలు చేయకపోవడం పులివెందుల కోర్టు ఆయనకు డీఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. తాజాగా ఈ కేసులో దూకుడు పెంచిన సీబీఐ.. ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించింది. కేసును త్వరగా క్లోజ్ చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో సీబీఐ వాదనలతో కోర్టు ఏకీభవించి.. ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
మరోవైపు వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసేందుకు సీబీఐ రెడీ అవుతోంది. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై కూడా గురువారం తీర్పు వచ్చే అవకాశం ఉంది. బెయిల్ విషయం తెలంగాణ హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీం కోర్టు సూచించిన విషయం తెలిసిందే. దీంతో నేడు హైకోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Also Read: IPL 2023 Points Table: తలైవా మ్యాజిక్.. టాప్‌లో చెన్నై సూపర్ కింగ్స్.. ఎస్ఆర్‌హెచ్ పరిస్థితి ఇలా..!
Also Read: Liquid DAP: రైతులకు గుడ్‌న్యూస్.. లిక్విడ్ డీఏపీ వచ్చేసింది.. ధర ఎంతంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook