Harish Rao On Vizag Steel Plant: దాదాపు గత నెలరోజులుగా ఏపీలో విశాఖ ఉక్కు ఉద్యమం కొనసాగుతోంది. రోజురోజుకూ ఉద్యమానికి మద్దతు పెరుగుతోంది. ఈ క్రమంలో ఏపీలో అధికార, ప్రతిపక్ష నేతలతో పాటు ఎన్‌జీవోలు విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం కానియకుండా అడ్డుకుంటామని పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ నుంచి సైతం విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు లభిస్తోంది. రోజురోజుకూ మద్దతు తీవ్రరూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొన్న టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ఏపీ సోదరులకు తన మద్దతు ఉందన్నారు. మేం కూడా ఇదే దేశంలో ఉన్నాం, పొరుగున్న ఉన్న తెలుగు వారికి తమ వంతు మద్దతు కచ్చితంగా ఉంటుందని, అవసరమైతే సీఎం కేసీఆర్ అనుమతితో విశాఖకు చేరుకుని ప్రత్యక్షంగా మద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నామని కేటీఆర్(Telangana Minister KTR) ఇటీవల పేర్కొన్నారు. పోరాడి సాధించుకున్న ఉక్కు పరిశ్రమను వదులకునే ప్రసక్తే లేదన్నారు.


Also Read: YSRCP Formation Day: వైఎస్సార్‌సీపీ 10 ఏళ్ల ప్రయాణంపై ఏపీ సీఎం YS Jagan ఏమన్నారంటే


తాజాగా బావమరిది కేటీఆర్ బాటలో తెలంగాణ మంత్రి హరీష్ రావు నడుస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో విశాఖ ఉక్కు ఉద్యమంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్కో పరిశ్రమను అమ్మేస్తున్నట్లుగా, విశాఖ ఉక్కు పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం అమ్మేస్తుంటే చూస్తు కూర్చోవాలా అని సూటిగా ప్రశ్నించారు. బీఎస్ఎన్ఎల్ తరహాలో ఒక్కో సంస్థ, పరిశ్రమలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటుపరం చేస్తోందని, చూస్తూ కూర్చుంటే రేపు తెలంగాణలో ఉన్న సింగరేణి లాంటి సంస్థలను సైతం అమ్మేస్తారని హరీష్ రావు అభిప్రాయపడ్డారు. అందుకే తాము విశాఖ ఉక్కు ఉద్యమం కోసం పోరాటం చేస్తున్న ఏపీ సోదరులకు మద్దతు తెలిపినట్లు వివరించారు. 


Also Read: Chiru on vizag steel plant: విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు మద్దతుగా నేను సైతం అంటున్న చిరంజీవి


మరోవైపు అధికార టీఆర్ఎస్ నేతలపై, మంత్రులలపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సహా మరికొందరు నేతలు మండిపడుతున్నారు. ఏపీతో తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే విశాఖ ఉక్కు ఉద్యమానికి(Vizag Steel Movement) టీఆర్ఎస్ నేతలు మద్దతిస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో లబ్ది పొందేందుకు అధికార టీఆర్ఎస్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని వారి మద్దతుపై తీవ్రంగా ఆరోపిస్తున్నారు. అమ్మకు అన్నం పెట్టలేనోడు, పిన్నమ్మకు బంగారు గాజులు కొనిస్తారా అంటూ టీఆర్ఎస్ నేతలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.


Also Read: Vizag steel plant: విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యపై ప్రధాని అప్పాయింట్‌మెంట్ కోరిన వైఎస్ జగన్ 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook