AP CM YS Jagan On YSRCP Formation Day: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిది ప్రత్యేకమైన చరిత్ర. తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విలువలు, విశ్వసనీయతను మరింత ముందుకు తీసుకెళుతూ వైఎస్ జగన్ స్థాపించిన పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (YSRCP). ఎన్నో కష్టాలకు తగ్గ ప్రతిఫలం గత అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్సార్సీపీ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. నేటి (మార్చి 12)తో దశాబ్దకాలం పూర్తి చేసుకుని 11వ వసంతంలోకి పార్టీ అడుగుపెట్టింది. తొలిసారిగా జరిగిన ఉప ఎన్నికలో 19 స్థానాలకుగానూ 17 అసెంబ్లీ సీట్లు, ఒక ఎంపీ స్థానాన్ని వైఎస్ జగన్ పార్టీ కైవసం చేసుకుంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకుగానూ 67 స్థానాలు సాధించి తొలి ప్రయత్నంలో బలమైన ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్(AP CM YS Jagan Mohan reddy) ప్రజల పక్షాన నిలిచారు. 3,648 కిలోమీటర్ల ప్రజా సంకల్ప యాత్రతో రాష్ట్ర ప్రజలకు మరింత చేరువయ్యారు.
Also Read: Shani Amavasya: చెడు ప్రభావం తగ్గాలంటే శని అమావాస్య రోజున పాటించాల్సిన విషయాలివే
రెండో ప్రయత్నంలో 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో వైఎస్సార్సీపీ(YSRCP) 151 స్థానాల్లో విజయం సాధించింది. తద్వారా తొలిసారి ముఖ్యమంత్రిగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. నేడు వైఎస్సార్సీపీ 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
మహానేత ఆశయ సాధనే లక్ష్యంగా, విలువలు విశ్వసనీయతల పునాదులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పురుడు పోసుకుంది. ఈ పదేళ్ల ప్రయాణంలో కష్ట సుఖాల్లో నాకు అండగా నిలిచిన ప్రజలకు, నాతో కలిసి నడిచిన నాయకులకు, నా వెన్నంటి ఉన్న కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.#YSRCPFormationDay
— YS Jagan Mohan Reddy (@ysjagan) March 12, 2021
‘మహానేత ఆశయ సాధనే లక్ష్యంగా, విలువలు విశ్వసనీయతల పునాదులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పురుడు పోసుకుంది. ఈ పదేళ్ల ప్రయాణంలో కష్ట సుఖాల్లో నాకు అండగా నిలిచిన ప్రజలకు, నాతో కలిసి నడిచిన నాయకులకు, నా వెన్నంటి ఉన్న కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. #YSRCPFormationDay’ అని తన సంతోషాన్ని షేర్ చేసుకున్నారు.
Also Read: Big Risk For Your Money: మీ మొబైల్లో ఈ Apps ఉన్నాయా, తక్షణమే Delete చేసుకోండి, ఎందుకంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook