KTR Reacts On AP Politics: తెలంగాణలో రాజకీయాలు హీటెక్కిస్తున్నాయి. ఓ వైపు మునుగోడు ఎన్నికల ప్రచారం.. మరోవైపు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం హాట్ టాపిక్‌గా మారాయి. మునుగోడులో ఎవరు గెలుస్తారనే చర్చ జరుగుతుండగా.. అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలుకు ప్రయత్నించిన వారి వెనుక ఎవరున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్ వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉంటునే.. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. మునుగోడులో టీఆర్ఎస్‌దే గెలుపు అని ధీమాగా చెబుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా కేటీఆర్ ఏపీ విషయాలపై కూడా స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో అందరూ తనకు స్నేహితులేనని.. అందరితో మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి తనకు మంచి మిత్రుడని చెప్పిన కేటీఆర్.. అందులో ఎలాంటి అనుమానం లేదన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తాను ఇప్పుడే స్పందించనని.. ఎవరి అభిప్రాయం వారికి ఉంటుందన్నారు. అయితే అవి రాజకీయ పరిస్థితులను బట్టి మారుతుంటాయని అన్నారు. 
 
'ఏపీలో నాకు సీఎం జగన్‌తోనే కాదు.. లోకేష్‌, పవన్ కళ్యాణ్‌ కూడా మిత్రులే. ఎవరితో నాకు పంచాయతీ లేదు. ముగ్గురు నాతో బాగానే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు నా కంటే వయసులో చాలా పెద్దవారు. ఆయన అంటే నాకు ఎంతో గౌరవం ఉంది. ఆయన ఎక్కడైనా కనిపిస్తే మర్యాదపూర్వకంగా పలకరిస్తా. ఆంధ్రప్రదేశ్‌లోని అందరితోనూ నాకు సత్సంబంధాలు ఉన్నాయి..' అంటూ కేటీఆర్ చెప్పుకొచ్చారు. 


ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఒక వైపు మాట్లాడటం తనకు ఇష్టం లేదన్నారు కేటీఆర్. ఆ రాష్ట్రంలో రాజకీయాలను అక్కడి ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు. మూడు రాజధానుల అంశంపై కూడా మంత్రి స్పందించారు. మూడు రాజధానులను అక్కడి ప్రజలు.. ఆ రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిపక్షాలు నిర్ణయించుకునే అంశమన్నారు. తనకు కూడా అభిప్రాయాలు ఉంటాయని.. అవి బయటకు చెప్పకూడదంటూ కేటీఆర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన వారన్నారు. 


తాను గుంటూరులోనే చదువుకున్నానని ఆయన చెప్పారు. తనకు విజయవాడలో ఫ్రెండ్స్‌ ఉన్నారని.. కాకినాడలో బంధువులు ఉండేవారన్నారు. ఇక అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్నారు. ఎన్టీఆర్, ఇందిరాగాంధీ వంటి వాళ్లనే ప్రజలు ఓడించారని గుర్తు చేశారు. ఎన్టీఆర్, ఇందిరాగాంధీ కంటే తాము గొప్పవాళ్లం కాదని.. సీఎం కేసీఆర్ కూడా శాశ్వతంగా అధికారంలో ఉండరని అన్నారు. ఈ విషయం తమకు తెలుసంటూ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 


Also Read: Petrol Diesel Price: ఎట్టకేలకు ఊరట.. తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు


Also Read: LPG Gas Cylinder Rates: గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన గ్యాస్‌ సిలిండర్ ధరలు.. కొత్త రేట్లు ఇలా..  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook