ఎట్టకేలకు శ్రీరెడ్డి వ్యవహారంపై  తెలంగాణ సర్కార్ చొరవు చూపింది. ఇందులో భాగంగా ఈ రోజు  సినీమాటోగ్రఫీ  మంత్రి తలసాని యాదవ్ మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌సభ్యులతో  పాటు పలువురు సినీ ప్రముఖులతో చర్చలు జరిపారు. ఈ  భేటీ అనంతరం మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు. చలనచిత్ర అభివృద్ధి సంస్థ ద్వారా ఆర్టిస్టులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. మహిళా ఆర్టిస్టులపై వేధింపులు, లైగింక దాడులు  వంటి చర్యలకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తామన్నారు. సినీ పరిశ్రమలో బ్రోకర్ల వ్యవస్థను నిర్మూలిస్తామని హామీ ఇచ్చారు. ఇకపై నటులకు మేనేజర్ల ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాలకు చెల్లింపులు జరిగేలా చూస్తామన్నారు. ఇప్పటికైనా ఈ  వివాదాన్ని ఇక్కడితో నిలిపివేయాలని ఈ సందర్భంగా మంత్రి కోరారు. ఏమైన సమ్యలు ఉంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సత్వరమే పరిష్కరించే చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని హామీ ఇచ్చారు.