Village Business Ideas: ఎవరికీ తెలియని బిజినెస్..జస్ట్ ఇంటి ముందు స్థలం ఉంటే చాలు.. నెలకు రూ. 1 లక్ష సంపాదించే చాన్స్

Business Ideas: మహిళలు ఇంట్లో ఉండి మీరు ఆదాయం సంపాదించాలి అనుకుంటున్నారా? ఎలాంటి బిజినెస్ చేస్తే మీ ఇంటి అవసరాలకు తగ్గ ఆదాయం లభిస్తుంది అని ఆలోచిస్తున్నారా?  అయితే ఓ చక్కటి బిజినెస్ ఐడియా మీకోసం? ఈ బిజినెస్ ద్వారా మీరు సులభంగా ప్రతి నెల ఆదాయం సంపాదించుకోవచ్చు.

Written by - Bhoomi | Last Updated : Sep 28, 2024, 12:21 PM IST
Village Business Ideas: ఎవరికీ తెలియని బిజినెస్..జస్ట్ ఇంటి ముందు స్థలం ఉంటే చాలు.. నెలకు రూ. 1 లక్ష సంపాదించే చాన్స్

Business Ideas: బిజినెస్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారా… అయితే ఓ చక్కటి  బిజినెస్ ఐడియా మీకోసం అందిస్తున్నాం. ఈ బిజినెస్ అది తక్కువ పెట్టుబడి తోనే మీరు ఇంటి వద్ద ప్రారంభించి చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. చాలా తక్కువ మొత్తంలోనే అది కూడా కేవలం 10 వేల పెట్టుబడి తోనే మీరు ఈ వ్యాపారం చేయడం ద్వారా… నెలకు కనీసం 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు సంపాదించే అవకాశం ఉంటుంది. అలాంటి బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు పెరుగుతున్న ఖర్చుల నుంచి మీ కుటుంబాన్ని కాపాడుకోవచ్చు. మీ ఇంటి వద్ద ఖాళీ స్థలం ఉంటే ఔషధ మొక్కలను పెంచి అమ్మడం ద్వారా మీరు చక్కటి ఆదాయం పొందవచ్చు. ఈ ఔషధ మొక్కలకు ప్రస్తుతం చాలా మంచి డిమాండ్ ఉంది. వీటిని ఇంట్లో పెంచుకోవడం ద్వారా వీటి ద్వారా వచ్చే ఔషధ గుణాలతో బీపీ, షుగర్, థైరాయిడ్, క్యాన్సర్ వంటి వ్యాధులను తగ్గించుకోవచ్చు.  ముందుగా  మీరు ఖాళీ స్థలంలో గ్రీన్ హౌస్ పద్ధతిలో ఒక చిన్న నర్సరీ ఏర్పాటు చేసుకోవాలి వీటిలో మీరు కుండీలు ఏర్పాటు చేసుకొని ఔషధ మొక్కలను పెంచాల్సి ఉంటుంది.  ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కొన్ని రకాల ఔషధ మొక్కలను మంచి డిమాండ్ ఉంది. వీటిని మీరు కుండీల్లో పెంచితే మంచి లాభం పొందే వీలుంది. సాధారణ పూల మొక్కల కుండీల కన్నా కూడా ఔషధ మొక్కల కుండీలకు డిమాండ్ ధర ఎక్కువగా ఉంటుంది. 

Also Read: Car: డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ తప్పులు చేశారో.. మీ కారు షెడ్డుకు పోవాల్సిందే

ఈ మొక్కలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది:

తులసి మొక్క : తులసి మొక్కకు ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. మీరు ఈ మొక్కను అమ్మాలంటే ముందుగా తులసి నారను తెచ్చి కుండీల్లో నాటుకొని పెంచాలి. అంతే కాదు సాధారణ తులసి కుండీల కన్నా కూడా తులసి కోట ఆకారంలోని కళాత్మకమైన కుండీలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా తులసి కుండీ ధర రూ. 50 నుంచి రూ. 100 వరకూ ఉంటుంది. అయితే తులసి కోటతో పాటు అయితే దీని ధర రూ. 200 నుంచి రూ. 1000 వరకూ ఉంటుంది. వీటిని కార్తీక మాసంలో ఎక్కువగా కొనుగోలు చేస్తారు. 

ఈ మొక్కలను విక్రయిస్తే మంచి లాభం:

ఉత్తరేణి, ఉసిరి, తెల్ల జిల్లేడు,నల్ల పసుపు, గురివింద, శ్రీగంధం,శతావరి, సునాముఖి, పాషాణ భేది, కలబంద, బిళ్ళ గన్నేరు, బ్రహ్మ కమలం, తెల్ల జిల్లేడు, దూలగొండి, తిప్పతీగ, మాచిపత్రి, అశ్వగంధ 

పైన పేర్కొన్న మొక్కలను ఇంట్లో పెంచితే వీటి నుంచి వచ్చే గాలి ఆరోగ్యానికి చాలా మంచిది అని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మీ ఇంట్లో ఈ మొక్కలను పెంచడం సరైన ఎంపికగా చెప్పవచ్చు. ఈ మొక్కల డిమాండ్ ను బట్టి మీరు కుండీల రేటును ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. అరుదైన మొక్కలను రూ. 1000 నుంచి 3000 వరకూ వసూలు చేస్తుంటారు. 

ఈ బిజినెస్ కోసం మీరు ప్రారంభ పెట్టుబడి కింద 25వేలు పెడితే సరిపోతుంది. ఇందులో మీరు ఎక్కువ మొత్తం గ్రీన్ హౌస్ ఏర్పాటుకు పెట్టవచ్చు. మిగితా మొత్తం కుండీలు, మట్టి, విత్తనాలు, ఇతర గార్డెనింగ్ సామాగ్రి కోసం ఖర్చు చేయాలి. పబ్లిసిటీ కోసం సోషల్ మీడియా వేదికలు అయిన ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, యూట్యూబ్ ద్వారా ప్రచారం చేసుకోవచ్చు. అప్పుడు మీకు ఆన్ లైన్ ద్వారా కూడా ఆర్డర్లు పొందవచ్చు.

Also Read: Success Story: ఆమె సంకల్పం ముందు పేదరీకం ఓడింది.. ఆర్థిక కష్టాల్లో నుంచి పుట్టిన ఒక ఆలోచన.. ఆమె జీవితాన్నే మార్చేసింది

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News