Janasena: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 20 నెలల గడువున్నా ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. 2019 ఎన్నికల్లో 151 సీట్లు గెలిచిన వైసీపీ.. ఈసారి ఏకంగా మొత్తం 175 సీట్లకు టార్గెట్ పెట్టుకుంది. కుప్పం సహా అన్ని గెలుస్తామని పదేపదే చెబుతున్నారు వైసీపీ అధినేత సీఎం జగన్.  వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ చీఫ్ చంద్రబాబు పావులు కదుపుతున్నారు. జనవరిలో నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయబోతున్నారు. ఇక పార్టీల్లోకి వలసలు మొదలయ్యాయి. ఇతర పార్టీల్లోని బలమైన నేతలకు తమవైపు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు ప్రధాన పార్టీలు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ కమెడీయన్ నటుడు ఆలీ జనసేనలో చేరడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆలీ అధికార వైసీపీలో ఉన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తో ఆలీకి మొదటి నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి. అయినా ఆలీ జనసేనలో చేరకుండా గత ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా నిలిచారు. జగన్ గెలుపు కోసం ప్రచారం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాకా ఆలీకి మంచి పదవి ఇవ్వనున్నారనే ప్రచారం సాగింది. సీఎం జగన్ కుడా పలుసార్లు ఆలీని పిలిపించుకుని మాట్లాడారు. దీంతో రాజ్యసభ సీటును ఆయనకు ఇస్తారనే వార్తలు వచ్చాయి. ఏపీలో రాజ్యసభ ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఆలీ పేరు వినిపించింది. కాని ఆయనకు పదవి మాత్రం దక్కలేదు.తర్వాత ఎమ్మెల్సీ ఇస్తున్నారనే చర్చ వచ్చింది. అది కూడా రాలేదు. చట్టసభలు కాదు కీలకమైన కార్పొరేషన్ పదవి ఆలీని ఇస్తారని వైసీపీ వర్గాల్లో టాక్ వచ్చింది. కాని ఇప్పటివరకు హీరోకు ఏ పదవి దక్కలేదు.


వైసీపీ తీరుపై అసంతృప్తిగా ఉన్న ఆలీ.. పార్టీ మారాలని భావిస్తున్నారని తెలుస్తోంది. జీవితంలో ఒక్కసారైనా ఎమ్మెల్యే కావలన్నది ఆలీ ఆశయమని ఆయన అనుచరులు చెబుతుంటారు. వైసీపీ తనకు అన్యాయం చేసిందనే భావనలో ఉన్న  ఆలీ.. జనసేన పార్టీలో చేరి తన ఆశయాన్ని నెరవేర్చుకోవాలని  అనుకుంటున్నారని టాక్ వస్తోంది. ఆలీ సొంత జిల్లా తూర్పుగోదావరి. ఆ జిల్లాలో పవన్ కల్యాణ్ పార్టీకి బలం ఉంది. జనసేనాని సామాజికవర్గం మద్దతు కూడా లభిస్తుందని. ఈ లెక్కలతోనే జనసేనలో చేరి రాజమండ్రి లేదా రాజమండ్రి రూరల్ నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని ఆలీ ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. ఈ రెండు చోట్ల వీలుకాని పక్షంలో తూర్పుగోదావరి జిల్లాలో మరేదైనా నియోజకవర్గం నుంచి పోటీ చేసే యోచనలో హీరో ఉన్నారనే ప్రచారం సాగుతోంది. ఆలీ పార్టీలో చేరితే తగిన ప్రాధాన్యత ఇచ్చేందుకు పవన్ కల్యాణ్ సిద్ధంగా ఉన్నారని జనసేన వర్గాలు చెబుతున్నాయి.


Also read: AP ASSEMBLY LIVE UPDATES: ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పుపై టీడీపీ రచ్చ.. సీఎం జగన్ పై చంద్రబాబు ఆగ్రహం


Also read: ఈ బౌలింగ్‌, ఫీల్డింగ్‌ ఏందిరా సామీ.. టీ20 ప్రపంచకప్‌ ట్రోఫీ దేవుడెరుగు కానీ తొలి రౌండ్‌ కూడా కష్టమే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook