Chandra Babu Comments: రాయలసీమ జిల్లాల్లో పాగా వేయాలని భావిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు..ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని చూస్తున్నారు. ఈక్రమంలో జిల్లాల పర్యటనలను వేగవంతం చేశారు. జగన్ ఇలాకాలో సమర శంఖం పూరించిన ఆయన..ఇవాళ కర్నూలు జిల్లాలో  పర్యటించారు. టూర్‌లో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా సీఎం జగన్, వైసీపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు చంద్రబాబు. టీడీపీ ముందు సీఎం జగన్ బచ్చ అంటూ ఫైర్ అయ్యారు. రాజ్యసభ సీట్లను ఏ-2కు, తన కేసులు వాదించే వారికి, బాంబేలో లాబియంగ్ చేసే వారికి ఇచ్చారని విమర్శించారు. ఏ-2 అప్రూవర్‌గా మారిన మరు క్షణం సీఎం జగన్ జైలుకు వెళ్తారని మండిపడ్డారు.  పులివెందులలో బస్ స్టాండ్‌ కట్టలేని వారు మూడు రాజధానులు నిర్మిస్తారా అని ప్రశ్నించారు. 


రాష్ట్రం కోసం గత సీఎంలు మూడు లక్షల కోట్లు అప్పులు చేస్తే..సీఎం జగన్ ఏకంగా 8 లక్షల కోట్లు అప్పు చేశారని తెలిపారు. కర్నూలులో హైకోర్టు వస్తుందని మాయమాటలు చెబుతున్నారని..ఇంతవరకు ఏం జరిగిందన్నారు. టీడీపీ హయాంలో ఐటీ ఉద్యోగాలు ఇస్తే..వైసీపీ సర్కార్.. వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి గొప్పలు చెప్పుకుంటోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కష్ట కాలంలో పార్టీ కోసం పనిచేసే వారికే గుర్తింపు ఉంటుందన్నారు.


వారిని తన గుండెల్లో పెట్టుకుంటానని స్పష్టం చేశారు. వారికే వచ్చే ఎన్నికల్లో పెద్దపీట ఉంటుంది..టికెట్లు కూడా ఇస్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతే కేటాయిస్తామని తేల్చి చెప్పారు. ఒక్కో నియోజకవర్గంలో 5 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు చంద్రబాబు. పార్టీలో 2.0 వెర్షన్ తీసుకొస్తానని స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధి ఎలా ముందుకు వెళ్లాల్లో పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు బాబు.


Also read:Supreme court:దిశా ఎన్‌కౌంటర్‌పై రేపు సుప్రీం కోర్టు కీలక ప్రకటన..!


Also read:Supreme Court on GST: జీఎస్టీపై భారత సర్వోన్నత న్యాయ స్థానం కీలక తీర్పు..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook