Supreme court:దిశా ఎన్‌కౌంటర్‌పై రేపు సుప్రీం కోర్టు కీలక ప్రకటన..!

Supreme court: దేశవ్యాప్తంగా కలకలం రేపిన దిశా ఎన్‌కౌంటర్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దీనిపై రేపు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. దిశ కమిషన్‌ నివేదికపై రేపు కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 2019 డిసెంబర్‌ 6న  దిశా కేసు నిందితులు ఎన్‌కౌంటర్‌ అయ్యారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 19, 2022, 03:00 PM IST
  • తెరపైకి దిశా ఎన్‌కౌంటర్ అంశం
  • కీలక ప్రకటన చేయనున్న సుప్రీం కోర్టు
  • విచారణ పూర్తి చేసిన కమిషన్
Supreme court:దిశా ఎన్‌కౌంటర్‌పై రేపు సుప్రీం కోర్టు కీలక ప్రకటన..!

Supreme court: దేశవ్యాప్తంగా కలకలం రేపిన దిశా ఎన్‌కౌంటర్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దీనిపై రేపు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. దిశ కమిషన్‌ నివేదికపై రేపు కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 2019 డిసెంబర్‌ 6న  దిశా కేసు నిందితులు ఎన్‌కౌంటర్‌ అయ్యారు. ఈ ఘటన తెలుగురాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా  సంచలనంగా మారింది. ఎన్‌కౌంటర్ అనంతరం ఘటనపై సుప్రీంకోర్టు కమిషన్‌ను ఏర్పాటు చేసింది.  

సిర్పూర్కర్, రేఖ ప్రకాష్‌, కార్తికేయన్ సభ్యులతో త్రిసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేశారు. దాదాపు మూడేళ్ల పాటు దీనిపై కమిషన్ విచారణ జరిపింది. తెలంగాణ హైకోర్టు వేదికగా విచారణ సాగింది. పోలీసులు, సాక్ష్యులతోపాటు బాధిత కుటుంబసభ్యులను కమిషన్ విచారించింది. దిశా ఎన్‌కౌంటర్ స్థలిని సైతం పరిశీలించింది. అక్కడి పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులను విచారించారు. అప్పటి సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ను సైతం పలు దఫాలుగా ప్రశ్నించింది.  

ఇటీవల విచారణ పూర్తి చేసిన కమిషన్..నివేదికను సుప్రీం కోర్టు(SUPREME COURT)కు అందించింది. ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. కమిషన్‌ నివేదినను గోప్యంగా ఉంచారు. రేపటి విచారణకు ఆర్టీసీ ఎండీ, అప్పటి సీపీ సజ్జనార్‌ కానున్నట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు విచారణపై తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సర్వోన్నత న్యాయస్థానం ఎలాంటి ప్రకటన చేస్తుందన్న చర్చ జరుగుతోంది.

Also read:Supreme Court on GST: జీఎస్టీపై భారత సర్వోన్నత న్యాయ స్థానం కీలక తీర్పు..!

Also read:Siddharth comments:కేజీయఫ్‌-2 పాన్ ఇండియా మూవీనా..నటుడు సిద్ధార్థ్‌ హాట్ కామెంట్స్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News