ఇప్పుడు పూర్తిగా చంద్రముఖిలా మారింది చూడవచ్చు..చంద్రముఖి సినిమాలో ఓ డైలాగ్ ఇది. నిమ్మగడ్డకు ఇది పూర్తిగా వర్తిస్తుందంటున్నారు వైసీపీ నేతలు. కారణమేంటంటే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) ఎన్నికల కమీషనర్  నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ( Nimmagadda Ramesh kumar ) వ్యవహారశైలి ఆద్యంతం వివాదాస్పదంగానే ఉంది. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ప్రైవేట్‌గా టీడీపీ ( TDP ) నేతలతో భేటీ కావడం, టీడీపీ నేతలు చెప్పినట్టుగా చేయడంపై ఇప్పటికే అధికార పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చంద్రబాబు అండ్ కో చెప్పినట్టు ఆడుతున్నారనే విమర్శలున్నాయి. ఈ విమర్శల్ని నిజం చేస్తూ ఇవాళ కృష్ణా జిల్లాలో ఓ ఘటన చోటుచేసుకుంది. అదే ఇప్పుడు ట్రోలింగ్‌కు కారణమైంది. పూర్తిగా చంద్రముఖిలా మారింది చూడవచ్చంటూ మీమ్స్ వస్తున్నాయి.


కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోని మొవ్వ వేణుగోపాల స్వామిని దర్శించుకున్న ఎస్ఈసీ ( SEC ) నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు టీడీపీ నేతలు సాదర స్వాగతం పలకడమే కాకుండా..స్వయంగా సన్మానాలు చేశారు. ఆయన కూడా ఓ రాజకీయనేతలా వ్యవహరిస్తూ సన్మానాలు అందుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి టీడీపీ నేతలతో సన్మానాలు చేయించుకోవడం ఎంతవరకూ సమంజసమని అధికారపార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. 


Also read: AP: నిమ్మగడ్డ వర్సెస్ ఏపీ ప్రభుత్వం..అమ్మ ఒడి పరిస్థితేంటి ?