Chandra Babu Letter: ఏపీలో గ్రానైట్ అక్రమ మైనింగ్‌పై తీవ్ర చర్చ జరుగుతోంది. దీనిపై అధికార,విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS)కి టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా గుడిపల్లె మండలం గుతర్లపల్లిలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌ గురించి లేఖలో ప్రస్తావించారు. తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. క్వారీలో సీజ్‌  చేసిన గ్రానైట్ లారీల ఫోటోలను లేఖకు జత చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కుప్పం నియోజకవర్గంలో గ్రానైట్ అక్రమ మైనింగ్‌పై నేషనల్ గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో విచారణ జరుగుతున్నా అక్రమాలు ఆగలేదన్నారు. అధికార పార్టీ నేతలతో మైనింగ్,రెవెన్యూ అధికారులు కుమ్మక్కు అయ్యి అక్రమ మైనింగ్‌కు సహకరిస్తున్నారని లేఖలో చంద్రబాబు గుర్తు చేశారు. ప్రకృతి సంపదను కొల్లగొట్టి..పర్యావరణం దెబ్బతీసేలా అక్రమ మైనింగ్ జరుగుతోందని మండిపడ్డారు.


అక్రమ మైనింగ్‌కు పది గ్రానైట్‌ లారీలను సీజ్‌ చేయడం ఇందుకు నిదర్శమని చెప్పారు. తఖీలు పెంచి అక్రమ మైనింగ్‌ను అడ్డుకట్ట వేయాలని..తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అక్రమ మైనింగ్‌ గురించి ప్రభుత్వానికి ఎన్నిసార్లు వివరించినా..చర్యలు తీసుకోలేదని లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికైనా అక్రమార్కుల తాట తీయాలన్నారు. దీనిపై ప్రజా పోరాటం చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు.


Also read: TS Inter Board: ఏ సబ్జెక్ట్‌ను తొలగించడం లేదు..తెలంగాణ ఇంటర్ బోర్డు క్లారిటీ..!


Also read:Umran Malik: ఐపీఎల్ 2022 అవార్డుల ద్వారా.. ఉమ్రాన్‌ మాలిక్‌ ఎంత సంపాదించాడో తెలుసా?  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G 


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook