TDP Mahanadu: టీడీపీ మహానాడు వేదికగా సీఎం జగన్‌పై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. జగన్‌ను ఇంటికి పంపేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. క్విట్ జగన్-సేవ్ ఆంధ్రప్రదేశ్ అనే నినాదాన్ని ఎక్కిపెట్టారు. రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సభకు ప్రజలు రాకుండా అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. ప్రజలంతా టీడీపీ వైపే ఉన్నారని స్పష్టం చేశారు.
బాదుడే బాదుడు కార్యక్రమాన్ని మంచి స్పందన వస్తోందన్నారు. వైసీపీ చేపట్టిన బస్సు యాత్రకు జనం కరువు అయ్యారని ఎద్దేవా చేశారు చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వం రూ.8 లక్షల కోట్లు అప్పు చేశారని ఆరోపించారు. సంక్షేమ పథకాల పేరిట రూ.లక్షల కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు. ఆ అప్పును సీఎం జగన్ చెల్లిస్తారా అని ప్రశ్నించారు. క్వార్టర్ బాటిల్ ధర రూ.9 ఉండేదని..కానీ వైసీపీ ప్రభుత్వం రూ.21 చేసిందన్నారు. ఇందులో రూ.12 సీఎం జగన్ జేబులోకి వెళ్తుందని ఆరోపించారు.
అధికారంలోకి రాగానే జగన్ అవినీతిని సొమ్మును కక్కిస్తామన్నారు. బద్వేలులో 8 వేల ఎకరాలను కబ్జా చేశారని చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి పంచుకుంటున్నారని మండిపడ్డారు. వైసీపీ మూడేళ్ల పాలనలో రూ.1.75 లక్షల కోట్ల అవినీతి జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు చెప్పిన ప్రత్యేక హోదా ఏమైందని ప్రశ్నించారు. 25 ఎంపీ సీట్లు గెలిపిస్తే కేంద్రంపై పోరాటం చేస్తామన్నారు..ఏమయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ సీఎం అయ్యాక రాష్ట్రం నుంచి పరిశ్రమలు వెళ్లిపోయాయన్నారు. కొత్తగా ఉద్యోగాలేమి రాలేదని చెప్పారు. అధికారంలోకి రాగానే జిల్లాల విభజనపై సమీక్ష చేసి అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా వైసీపీ అరాచకాలను ఎండగట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సెల్‌ఫోన్ ఆయుధంగా సామాజిక ఉద్యమం చేసి..వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలన్నారు.
30 లక్షల ఇళ్లు కట్టిస్తానని ..మూడేళ్లలో ఎన్ని ఇళ్లు నిర్మించారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. రాజధానిపై ఇప్పటికైనా స్పష్టత ఇవ్వాలన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను అనుగుణంగా ముందుకు వెళ్తున్నామన్నారు. ఇకపై ప్రతి జిల్లాలో మహానాడు పెడతామని స్పష్టం చేశారు. వైసీపీ అవినీతిని ఇంటింటికి తీసుకెళ్లాలన్నారు. బాదుడే బాదుడు కార్యక్రమాన్ని ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలన్నారు.
Also read:Minister Karumuri Comments: నోరు జారిన ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు..ఏంటా కథ..!
Also read:TTD Temple: కరీంనగర్‌లో శ్రీవారి ఆలయం పనులు షురూ..త్వరలో టెంపుల్ డిజైన్లు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook