Anantha Sriram: ప్రముఖ తెలుగు సినిమా పాటల రచయిత అనంత శ్రీరామ్ చుట్టూ వివాదం రాజుకుంటోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ట్రోలింగ్ చేసిన పొలిటికల్ మిస్సైల్ పేజీ వెనుక శ్రీరామ్ పేరు విన్పించడమే ఇందుకు కారణం. నిజంగానే ఈ ట్రోలింగ్ వెనుక అనంత శ్రీరామ్ ఉన్నాడా, అతనేమంటున్నాడో తెలుసుకుందాం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఓ చిన్నారిని స్టెతస్కోప్‌తో పరీక్షిస్తున్న ఫోటో, ఆ ఫోటోపై వ్యాఖ్యలే మొత్తం వివాదానికి కారణంగా మారాయి. స్కానింగ్ అవసరం లేకుండా జస్ట్ అలా స్టెతస్కోప్‌‌తో చూసి గుండెలో రంధ్రముందని చెప్పేయడంపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ఫేక్ డాక్టర్ అంటూ ఆ ఫోటోతో పోస్టింగులు సోషల్ మీడియా వేదికల్లో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ పోస్టులు పొలిటికల్ మిస్సైల్ అనే సోషల్ మీడియా వేదికగా పోస్ట్ అయ్యాయి. తెల్లని పంచె-మలినమైన మనసు మహానేత అంటూ ట్వీట్లు కూడా పోస్డ్ అయ్యాయి. ఇదే ఇప్పుడు వైఎస్సార్ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. ఈ పేజీని నిర్వహిస్తున్నది అనంత శ్రీరామ్ అనేది వైఎస్సార్ అభిమానుల ఆరోపణ.


దాంతో అనంత శ్రీరామ్‌పై పెద్దఎత్తున ట్రోలింగ్‌కు దిగారు వైఎస్సార్ అభిమానులు. ఈ సందర్భంగా అనంత శ్రీరామ్ గతంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో దిగిన ఫోటోల్ని సైతంం షేర్ చేశారు. టీడీపీ సానుభూతిపరుడు కావడం, జనసేనతో అనుబంధాన్ని కలిగి ఉండటాన్ని ప్రశ్నిస్తూ ఉదాహరణగా చూపిస్తూ ట్రోలింగ్ పెరిగింది.


ఇప్పుడు ఈ ఆరోపణలు, పొలిటికల్ మిస్సైల్ పేజిపై గేయ రచయిత అనంత శ్రీరామ్ స్పందించాడు. కాస్సేపటి క్రితం ఓ వీడియో పోస్ట్ చేసి..తనపై వస్తున్న ఆరోపణల్ని ఖండించాడు. వైఎస్ పై విమర్శలు, పోస్టులతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. నాటా మహాసభల నిమిత్తం అమెరికాలో ఉన్న అనంత శ్రీరామ్ ఈ వ్యవహారానికి తనకూ సంబంధం లేదని స్పష్టం చేశాడు. వృత్తి రీత్యా అన్ని పార్టీలకు తాను పాటలు రాస్తుంటానన్నారు. భవిష్యత్తులో రాజకీయాలపై ఎలాంటి అభిప్రాయం వ్యక్తపర్చాల్సి వచ్చినా నిర్భయంగా తన అధికారిక సోషల్ మీడియా వేదికలపైనే ప్రకటిస్తానని అనంత శ్రీరామ్ చెప్పాడు. అమెరికా నుంచి వచ్చిన తరువాత ఈ వ్యవహారంపై సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేస్తానన్నాడు.


Also read: AP Pension Scheme: జగన్ సర్కారు శుభవార్త.. త్వరలో రెండో పెన్షన్‌..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook