Telugu States Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా 543 లోక్‌సభ సీట్లకు మార్చి 16న ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అంతేకాదు ఏడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 4 విడతల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికలు పూర్తయిన రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ ముగిసినట్టేనా ?  ఎన్నికలు పూర్తైయిన నేపథ్యంలో కొంత మంది ప్రజులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎన్నికలు పూర్తైయిన నేపథ్యంలో కోడ్ ఎన్నికలు పూర్తైయిన ప్రాంతాలకు వర్తిస్తుందా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఒక ప్రాంతంలో పోలింగ్ ముగిస్తే.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి కూడా ముగుసినట్టేనా.. ? ఈ విషయంలో ఎన్నికల కమిషన్ ఏం చెబుతుందంటే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశ వ్యాప్తంగా ముఖ్యంగా నాల్గో విడత ఎన్నికలతో దక్షిణాదిలోని అన్నిరాష్ట్రాలకు ఎన్నికల ప్రక్రియ పూర్తైయింది. జూన్ 4 ఎన్నికల ఫలితాలు వెలుబడనున్నాయి. దేశంలో ఇప్పటి వరకు నాలుగు దశల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. అందులో తెలుగు స్టేట్స్ అయిన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ కూడా ఉన్నాయి. మన రాష్ట్రాల్లో ఓటు వేసిన ప్రజలు ఇపుడు ఓ విషయంలో డౌట్ పడుతున్నారు. ఎన్నికల కోడ్ తెలుగు రాష్ట్రాల్లో ముగిసినట్టేనా.. ? లేదా..  అనే ప్రశ్న ఉదయిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓటింగ్ పూర్తయిన అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల ప్రవర్తనా నియామావళి పూర్తి కాలేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.


దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నిలు ప్రకటించిన తేది నుంచి దేశ వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలో ఒక రాష్ట్రంలో మొదటి దశ ఓటింగ్ పూర్తైనప్పటికీ, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంటుంద. ఎన్నికల ఫలితాలు వెలబడే రోజైన జూన్ 4 సాయంత్రం వరకు దేశ వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి ఉంటుంది. నాల్గో విడతతో  దేశ వ్యాప్తంగా 379 స్థానాలకు ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. మరో మూడు విడతల్లో 164 ఎంపీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తంగా ఏడు దశల ఎన్నికల తర్వాత జూన్ 4వ తేదిన ఓట్ల లెక్కింపు ఉంటుంది.  


ఇదీ చదవండి అకీరా, ఆద్యాకు అన్ని ఇచ్చా.. పవన్ ఎమోషనల్!!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter