Pawan Kalyan: జాబితాలో పవన్ కళ్యాణ్ పేరెందుకు లేదు, పోటీ చేయడం లేదా
Pawan Kalyan: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలుగుదేశం-జనసేన ఉమ్మడి జాబితా విడుదలైంది. పొత్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలు దక్కాయి. బీజేపీ కోసం కొన్ని సీట్లు వదిలిపెట్టి మిగిలిన జాబితాను టీడీపీ విడుదల చేసింది.
Pawan Kalyan: ఇవాళ విడుదలైన తెలుగుదేశం-జనసేన ఉమ్మడి జాబితాలో తెలుగుదేశం 94 మంది అభ్యర్ధుల్ని ప్రకటించగా జనసేన కేవలం 5 మంది పేర్లే వెల్లడించింది. బీజేపీకు ఎన్ని సీట్లనేది నిర్ధారించిన తరువాత మిగిలిన సీట్లలో టీడీపీ మరో జాబితా విడుదల చేయనుంది.
ఇవాళ విడుదలైన తొలి జాబితాతో కుప్పం నుంచి చంద్రబాబే పోటీ చేస్తారని ఖరారైంది కానీ జనసేనాని పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఇంకా నిర్ధారణ కాలేదు. జనసేన ప్రకటించిన ఐదుగురిలో తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్, నెల్లిమర్ల నుంచి లోకం మాధవి, రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ, కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ, అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణ ఉన్నారు. పపవ్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగినా జాబితాలో లేకపోవడంతో అక్కడ్నించి కూడా పోటీ చేయకపోవచ్చని తెలుస్తోంది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
జనసేన ఈసారి కచ్చితంగా 60-70 స్థానాల్లో పోటీ చేయాని అందరూ అడిగారని కానీ గతంలో 10 సీట్లు గెలిచుంటే అలా అడిగేందుకు అవకాశముండేదన్నారు. అయితే ఇప్పుడు సీట్ల సంఖ్య ముఖ్యం కాదని, గెలుపు ముఖ్యమని చెప్పారు. తక్కువ సీట్లలోనే పోటీ చేసి స్ట్రైక్ రేటు పెంచుకోవాలని సూచించారు. బీజేపీకు సైతం సీట్లు ఇచ్చే క్రమంలో తాము సీట్లు తగ్గించుకున్నట్టు స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
బీజేపీతో పొత్తుపై స్పష్టత వచ్చాక ఆ పార్టీకు మరి కొన్ని సీట్లు కేటాయించాల్సి వస్తుంది. అవి మిహాయించుకుని మిగిలిన సీట్లకు సంబంధించి తెలుగుదేశం పార్టీ రెండవ జాబితా విడుదల చేయనుంది. రెండవ జాబితాలో రాజమండ్రి రూరల్ నుంచి ఎవరనేది స్పష్టత రావల్సి ఉంది. అదే విధంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావుకు స్థానం ఉంటుందో లేదో తేలనుంది.
Also read: Janasena-Tdp List: జనసేన-తెలుగుదేశం ఉమ్మడి జాబితా విడుదల, జనసేనకు 24 స్థానాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook