కేసీఆర్ థార్డ్ ఫ్రంట్ పై చంద్రబాబు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంలో మోడీ సర్కార్ పై విరుచుకుపడిన చంద్రబాబు.. జాతీయ రాజకీయాల అంశాన్ని ప్రస్తావించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  తానూ జాతీయ రాజకీయాలను దగ్గర నుంచి చూశానని ..కేంద్ర పాలిటిక్స్ లో కీలక పాత్ర పోషించిన సందర్భాలున్నాయని వ్యాఖ్యనించారు.  


కేసీఆర్ ఇటీవలే థార్డ్ ఫ్రంట్ పై తన అభిప్రాయాన్ని వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు నోట జాతీయ రాజకీయాల అంశం రావడం గమనార్హం. చంద్రబాబు ఏ ఉద్దేశంతో జాతీయ రాజకీయాల అంశం లేవనెత్తారనే దానిపై జోరుగా చర్చలు నడుస్తున్నాయి. థార్డ్ ఫ్రంట్ ఫార్ములా పనిచేయదనే కోణంలో చంద్రబాబు చెప్పదల్చుకున్నారని కొందరు అభిప్రాయపడుతుంటే.. మోడీ సర్కార్ తో తెగదెంపులు చేసుకుని కేసీఆర్ తో కలిసి థార్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలనే ఆలోచన చంద్రబాబులో ఉందని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా చంద్రబాబు నోట జాతీయ రాజకీయాల మాట రావడం చర్చనీయంశంగా మారింది.