Hundi Theft incident in Tirumala: తిరుమల శ్రీవారి ఆలయం ఇటీవల  కాలంలో తరచుగా వార్తలలో ఉంటుంది.  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలకు పూర్వవైభవం తీసుకొని వచ్చేలా చర్యలు చేపట్టినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో చంద్రబాబు తిరుమల కొండపై పెనుమార్పులు సైతం తీసుకొచ్చినట్లు సమాచారం. వీఐపీ కల్చర్ ను తగ్గించేసి.. సామాన్య భక్తుడికి దర్శనం అయ్యే విధంగా చర్యలు తీసుకొవాలని ఆదేశించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీటీడీ అధికారులకు కూడా అన్నదానం, కాలీనడకన వచ్చే భక్తులకు అందిచాల్సిన సదుపాయల విషయంలో  సైతం కూటమి కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం తిరుమల లడ్డు వివాదం దేశంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటన రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. ఏకంగా సుప్రీం కోర్టు వరకు కూడా వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా, తిరుమలలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.


తిరుమల శ్రీవారిని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. భక్తుల కొంగు బంగారంగా భావిస్తారు. చాలా మంది నిలువు దోపిడి, తలనీలాలు.. ఇలా స్వామివారికి రకరకాలుగా మొక్కులు మొక్కుకుంటారు. చాలా జంటలు పెళ్లైన తర్వాత పెళ్లిపట్టు బట్టలతో తిరుమలకు వస్తామని మొక్కుకుంటారు. ఇదిలా ఉండగా.. తిరుమలలో జరిగిన షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  


ఈ నెల 23న మధ్యాహ్నం 2 గంటలకు శ్రీవారి ఆలయంలోని హుండీని.. తమిళనాడులోని శంకరన్‌ కోవిల్‌కు చెందిన వేణులింగం అనే యువకుడు  చోరీ చేసినట్లు తెలుస్తొంది. దానిలోని డబ్బుల్ని తీసుకుని అక్కడి నుంచి పారిపోయినట్లు సమాచారం.  ఇదంతా హుండీ సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డు అయింది.


Read more: Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌ అలెర్ట్‌.. ఆ 10 రోజులు దర్శనాలు రద్దు..!


హుండీ చోరీని గుర్తించిన భద్రత సిబ్బంది.. నిందితుడ్ని పట్టుకున్నట్లు తెలుస్తొంది. ఆ తర్వాత అతని దగ్గర నుంచి దాదాపు.. 15 వేల రూపాయలను రికవరీ చేసినట్లు తెలుస్తొంది. ఆ తర్వాత నిందితుడిని టీటీడీ విజిలెన్స్ అధికారులు పోలీసులకు అప్పగించారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఈ ఘటనతో తిరుమల మరోసారి వార్తలలో నిలిచింది.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.