విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ నిర్వహించిన స్వాత్రంత్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి జాతీయపతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం ఓ నినాదం కాకుండా ప్రభుత్వ విధానం కావాలని పిలుపునిచ్చారు. స్వాతంత్య సమరయోధుల ఆశయాలకు అనుగుణంగా పాలన  సాగిస్తామన్నారు. ప్రాథమిక హక్కులు రాజ్యాంగానికి ఆత్మ వంటివని అంబేడ్కర్‌ చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ... ఆ దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపారు. ఈ క్రమంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా నవరత్నాలు ప్రకటించి వాటిని చిత్తుశుద్ధితో అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జగన్ హావీలు ఇవే...


సాతంత్యదినోత్సవాన్ని పురస్కరించుకొని  ఏపీ సీఎం జగన్ హామీల వర్షం కురిపించారు. ఇప్పటికే వాలంటీర్లు, గ్రామ సచివాలయ పోస్టుల భర్తీకి గ్రీన్న సిగ్నల్ ఇచ్చిన జగన్...  ప్రభుత్వ శాఖల్లోని వివిధ ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామన్నారు. తర్వలోనే  2.66 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తామన్నారు.  కార్పొరేట్ సంస్కృతిని మార్చేందుకు పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ చేశామన్నారు. ఇల్లు లేని నిరుపేదల కోసం ఇల్లు నిర్మిస్తామన్నారు. ఉగాది కల్లా 25 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టి పేదలకు అందజేస్తామన్నారు. అలాగే సాగు, తాగు నీటి అవసరాలు తీర్చేందుకు ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్ని అడ్డుంకులు వచ్చినా పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు కచ్చితంగా స్థానికులకే ఇచ్చి తీరుతామన్నారు.నామినేటెడ్ పదవుల్లో బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించి వాటిలో సగ భాగం మహిళలకే ఇస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారు


ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన శకటాలు


ఇదిలా ఉంటే ప్రసంగానికి ముందు ముఖ్యమంత్రి జగన్ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. జగన్ ముఖ్యమంత్రి హోదాలో గౌరవం వదనం స్వీకరించడం ఇదే తొలి సారి కావడం గమనార్హం. కాగా ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పతాక ఆవిష్కరణ అనంతరం విధినిర్వహణలో ప్రతిభ కనబరిచిన పలువురు అధికారులకు సీఎం జగన్‌ పతకాలు ప్రదానం చేశారు.