ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని ప్రకాశం జిల్లా సూరారెడ్డిపాలెం, టంగుటూరు రైల్వే స్టేషన్ల మధ్య అర్థరాత్రి భారీ అగ్ని ప్రమాదం (fire accident) సంభవించింది. రైల్వే ట్రాక్‌పై వెళ్తున్న గూడ్సు రైలు నుంచి మూడు డీజిల్ ట్యాంకర్లు (oil tankers) కిందపడటంతో  ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో మూడు ఆయిల్ ట్యాంకర్లు పూర్తిగా కాలిపోయాయి. సరిగ్గా అదే సమయంలో గూడ్స్ రైలు నుంచి కొన్ని కోచ్‌ (కంపార్ట్‌మెంట్స్) వేరయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వెంటనే అప్రమత్తమైన రైల్వే అధికారులు:ఫైర్.సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలానికి  చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ సంఘటన కారణంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగకుండా ఈ మార్గంలో వెళ్లే నాలుగు రైళ్లను మరో మార్గం నుంచి మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. అయితే వెళ్తున్న రైలు నుంచి ట్యాంకర్లు కిందపడటంతో రైల్వే అధికారుల పని తీరుపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై ఆరాతీస్తున్నారు.  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ