విశాఖలో విష వాయువు లీక్.. ముగ్గురు మృతి, 200 మందికి పైగా అస్వస్థత
గోపాలపట్నం పరిధిలోని ఎల్.జి పాలిమర్స్ పరిశ్రమ నుంచి గురువారం వేకువ జామున ఈ విష వాయువులు (Visakha Gas Leakage) లీకైనట్లు సమాచారం. ఘటనపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు.
Visakha Gas Leakage | విశాఖపట్నంలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదకర విష వాయువు లీక్ కావడంతో ముగ్గురు మరణించగా, దాదాపు 200 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. గోపాలపట్నం పరిధిలోని ఎల్.జి పాలిమర్స్ పరిశ్రమ నుంచి గురువారం వేకువ జామున 3 గంటల సమయంలో ఈ విష వాయువులు లీకైనట్లు సమాచారం. ఘటనపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. సహాయక చర్యలు చేపట్టాలని, బాధితులకు సాయం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. Gold Price: మార్కెట్లో జోష్.. పెరిగిన బంగారం ధరలు
పరిశ్రమ నుంచి లీకైన విష వాయువు దాదాపు 3 కిలో మీటర్ల మేర తీవ్ర ప్రభావాన్ని చూపించింది. విష వాయువు కారణంగా ముగ్గురు చనిపోగా.. అందులో ఇద్దరు వృద్ధులు, ఓ చిన్నారి (8) ఉన్నారు. ప్రమాదకర వాయువు లీక్ కావడంతో స్థానికులు చర్మంపై దద్దుర్లు, శ్వాస సమస్యలు, కళ్లు మంటగా అనిపించడం, ఇతరత్రా సమస్యలతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. అందాల ‘కంచె’ కడుతోన్న ప్రగ్యా జైస్వాల్
[[{"fid":"185280","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Image Credit: twitter/ANI","field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Image Credit: twitter/ANI","field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"alt":"Image Credit: twitter/ANI","class":"media-element file-default","data-delta":"1"}}]]
కొందరు భయాందోళనకు గురై ఇళ్ల తలుపులు అన్ని మూసివేశారు. అయితే పరిశ్రమకు దాదాపుగా 3కి.మీ పరిధిలో ఉన్నవారిలో కొందరు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు వైద్య సిబ్బంది సహకారంతో బాధితులను విశాఖ కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. సమీపంలోని సింహాచలం బస్ డిపో నుంచి బస్సులను తీసుకొచ్చి విష వాయువు లీకైన పరిశ్రమకు 5 కి.మీ పరిధిలో నివాసం ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
క్యాలెండర్ గాళ్ అందాలు చూడతరమా!
Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!