తిరుమల దర్శనానికి విన్నూత విధానం
తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం విషయంలో వినూత్న విధానం ఈరోజు నుంచి అమలులోకి వచ్చింది.
తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం విషయంలో వినూత్న విధానం ఈరోజు నుంచి అమలులోకి వచ్చింది. టైమ్ స్లాట్ దర్శనాన్ని ఈరోజు ఉదయం ఆరు గంటలకు టీటీడీ ప్రారంభించింది. మొత్తం 14 ప్రాంతాల్లో 111 కౌంటర్లను ఏర్పాటుచేసి టోకెన్ల జారీ విధానానికి శ్రీకారం చుట్టారు.
అమలులోకి వచ్చిన వినూత్న విధానంతో భక్తులుకు ఇక్కట్లు తొలగిపోనున్నాయి. ఈ కొత్త పద్ధతితో భక్తులు రెండు గంటల్లోనే శ్రీవారి దర్శనం చేసుకొని బయటకు రావచ్చు. గరిష్ఠంగా 3 గంటల కంటే ఎక్కువ క్యూలైన్ లో నిల్చోవాల్సిన అవసరం లేదని టీటీడీ అధికారులు తెలిపారు. భక్తులు కూడా ఈ విన్నూత విధానానికి జై కొడుతున్నారు. అయితే.. ఆధార్ కార్టు వెంట తెచ్చుకొని వచ్చిన వారికి మాత్రమే టోకెన్లు జారీ చేస్తుండటంతో.. కొంత మంది భక్తుల నిరుత్సాహపడ్డారు.