Timesnow Survey: ఏపీలో ఈసారి అధికారం ఎవరిది, కేంద్రం పరిస్థితేంటి , సంచలనం రేపుతున్న మరో సర్వే
Timesnow Survey: తెలంగాణ సంగతేమో గానీ ఏపీలో మాత్రం ఎన్నికల వేడి పెరుగుతోంది. వైనాట్ 175 లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంటే..వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీ-జనసేనలు పనిచేస్తున్నాయి. మరి అధికారం ఎవరిది, ఆ ప్రముఖ సర్వే ఏం చెబుతోందనే విషయాలు తెలుసుకుందాం..
Timesnow Survey: ఏపీలో ఇప్పుడు సర్వేల సందడి పెరుగుతోంది. ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్న కొద్దీ వివిధ జాతీయ సంస్థలు ప్రజల నాడిని చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. టైమ్స్ నౌ మరోసారి సర్వే చేపట్టింది. అటు కేంద్రంలో ఇటు ఏపీలో ఎవరు అధికారంలో వస్తారనేది తేల్చిచెప్పేసింది. జగన్ వర్సెస్ పవన్ వర్సెస్ చంద్రబాబులో ఎవరికి ప్రజలు పట్టం కట్టనున్నారు..
దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో రానుంది, ఏపీలో పరిస్థితి ఎలా ఉందనే విషయంపై ప్రముఖ జాతీయ మీడియా సంస్థ టైమ్స్ నౌ మరోసారి సర్వే చేపట్టింది. ఈ సర్వే తాజాగా తీసుకున్న ప్రజాభిప్రాయం ఆధారంగా చేసింది కావడం విశేషం. జూన్ 15 నుంచి ఆగస్టు 12 మధ్యలో జరిపిన సర్వే ఫలితాలివి. లోక్‌సభకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మొత్తం 543 స్థానాల్లో ఎన్డీయే కూటమి 296-326 స్థానాలు గెల్చుకుని మరోసారి అధికారం చేజిక్కించుకోనుంది. అంటే ఎన్డీయే ప్రభుత్వం హ్యాట్రిక్ సాధించనుంది. ఇక బీజేపీ వరకైతే సొంతంగా 288 నుంచి 314 స్థానాలు గెల్చుకోవచ్చని తెలుస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ ఒంటరిగా 62-80 స్థానాలు గెల్చుకునే పరిస్థితి ఉండగా, ఇండియా కూటమికి 160-190 స్థానాలు రావచ్చని అంచనా.
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారం చేజిక్కిచుకోవడం ఖాయమని టైమ్స్ నౌ సంస్థ సర్వే చెబుతోంది. మొత్తం 25 లోక్‌సభ అసెంబ్లీ స్థానాల్లో 24-25 కచ్చితంగా గెల్చుకుంటుందని టైమ్స్ నౌ వెల్లడించింది. ఏప్రిల్ నెలలో ఇదే సంస్థ జరిపిన సర్వేలో కూడా వైసీపీకే పట్టం కట్టింది. అప్పటికీ ఇప్పటికీ స్వల్ప తేడా ఉంటుందని...ఏప్రిల్ నెల సర్వేతో పోలిస్తే వైసీపీ గ్రాఫ్ స్వల్పంగా పెరిగిందని సర్వేలో తేలింది. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 49.8 శాతం ఓట్లతో 22 లోక్‌సభ స్థానాలు గెల్చుకోగా ఈసారి 51.3 శాతం ఓట్లతో మొత్తం స్థానాల్ని లేదా 24 స్థానాల్ని గెల్చుకుంటుందని టైమ్స్ నౌ స్పష్టం చేసింది. అంటే 2019 ఎన్నికలతో పోలిస్తే వైసీపీ ఓటింగ్ శాతం 1.50 శాతం పెరిగింది.
ఇక ఏపీలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకు 36.20 శాతం, జనసేనకు 10.10 శాతం, బీజేపీకు 1.30 శాతం ఓటింగ్ షేర్ ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం లోక్‌సభలో నాలుగో అతిపెద్ద పార్టీగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ సర్వేతో మూడవ స్థానానికి చేరుకోవచ్చు. అంటే పార్టీల వ్యక్తిగత బలం ప్రకారం పరిశీలిస్తే బీజేపీ, కాంగ్రెస్ తరువాత అత్యధిక స్థానాలు గెల్చుకునే పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే కానుంది.
మరోవైపు తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల్లో బీఆర్ఎస్ అత్యదికంగా 9-11 స్థానాలు గెల్చుకోనుంది. బీజేపీ 2-3 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ 3-4 లోక్‌సభ స్థానాలు గెల్చుకోవచ్చు. అంటే తెలంగాణలో బీఆర్ఎస్ మరోసారి అంటే హ్యాట్రిక్ సాధించనుంది.
Also read: Rains Alert: ఏపీ, తెలంగాణకు ఇవాళ్టి నుంచి మూడ్రోజులు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook