Tirumala Alert : తిరుమల భక్తులకు అలర్ట్... ఆ దారులన్నీ బంద్
Tirumala to be closed from November 17th: నవంబర్ 17, 18 తేదీల్లో తిరుమలకు (Tirumala) వెళ్లే రెండు నడక దారులు మూసి వేస్తున్నట్లు టీటీడీ (అధికారులు తెలిపారు. రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.
Tirumala Alert Footsteps path from Alipiri, Srivari Mettu to Tirumala to be closed from November 17th: భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 17, 18 తేదీల్లో తిరుమలకు (Tirumala) వెళ్లే రెండు నడక దారులు మూసి వేస్తున్నట్లు టీటీడీ (అధికారులు తెలిపారు. రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. రెండు రోజులపాటు తిరుమలకు వెళ్లే రెండు నడకదారులు అలిపిరి, (Alipiri) శ్రీవారిమెట్టు తాత్కాలికంగా మూసివేయనున్నారు. భక్తుల భద్రతా దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ తెలిపింది. తిరుమలకు వెళ్లే భక్తులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రస్తుతం ఘాట్ రోడ్ ప్రయాణమే కాస్త సురక్షితమని టీటీడీ అధికారులు సూచించారు.
Also Read : MP Dharmapuri Arvind : వేములవాడ ఉప ఎన్నిక వస్తుంది.. భారీ కుంభకోణం బయటపడ్తది
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తిరుమల, తిరుపతి పూర్తిగా జలమయమయ్యాయి. తిరుమల ఘాట్ రోడ్లలో పలుచోట్ల చెట్లు కూలడంతో పాటు కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో రాత్రి సమయంలో ఘాట్ రోడ్లను (Ghat roads) మూసివేసే పరిస్థితి నెలకొంది. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఇక ఇప్పుడు కాలినడక మార్గాల్లో ( Footsteps path) భారీ వర్షాల కారణంగా సెలయేర్లు ప్రవహించడంతో పాటు కొండచరియలు విరిగిపడతం, చెట్లు కూలే ప్రమాదం ఉండటంతో రెండు రోజుల పాటు నడకదారిని మూసివేస్తూ టీటీడీ (TTD) నిర్ణయం తీసుకుంది.
Also Read : Eyy Bidda Idhi Naa Adda Telugu Promo: ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా సాంగ్ ప్రోమో చూశారా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook