Tirumala: మరో వివాదంలో తిరుమల.. అన్నదాన కేంద్రంలోని పెరుగన్నంలో జెర్రీ.. షాకింగ్ వీడియో వైరల్..
Tirumala news: తిరుమల అన్నదాన సత్రంలో ఒక భక్తుడికి దారుణమైన అనుభవం ఎదురైంది. అతను అన్నప్రసాదం తినేందుకు వెళ్లినప్పుడు.. పెరుగన్నంలో జెర్రీ బైటపడింది.
Tirumala insect jerry found in srivari annaprasadam video viral: తిరుమల లడ్డు వివాదం ఇప్పటికే దేశంలో కాకరేపుతుంది. ఈ నేథ్యంలో సీఎం చంద్రబాబు సైతం తిరుమలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పొటెత్తార. ఈ నేపథ్యంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఒక భక్తుడు.. టీటీడీకి చెందిన మాధవ నిలయం అన్నదాన కేంద్రంలో భోజనంలో జెర్రి వచ్చింది. భోజనం చేస్తున్న భక్తుని ఆకులో జెర్రీ చూసి షాకయ్యాడు. వెంటనే అక్కడున్న సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజగా, మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. టీటీడీ మాధవ నిలయం అన్నదాన కేంద్రంలో భోజనం చేస్తున్న భక్తుని ఆకులో జెర్రి కన్పించింది. వెంటనే అతను.. అక్కడున్న వారికి చెప్పాడు. టీటీడీ సిబ్బంది నిర్లక్ష్యపు సమాధానం చెప్పారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
దీంతో సదరు భక్తుడు.. తనకు కల్గిన అనుభవాన్ని రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కాస్త వైరల్ గా మారింది. ఈ ఘటన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈరోజు ఉదయమే అన్నదానం పై టీటీడీ అధికారులను సీఎం చంద్రబాబు హెచ్చరించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఈ ఘటనపై మాత్రం ఇప్పటి వరకు టీటీడీ మాత్రం స్పందించలేదని తెలుస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. గత ప్రభుత్వ హాయంలో అనేక అపవిత్రమైన పనులు జరిగాయన్న సర్కారు.. మరీ ఇప్పుడు ఇలా ఎందుకు జరుగుతున్నాయని కూడా విమర్శలు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.