Tirumala Hundi Collection Record Break: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఉత్తర ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటేత్తారు. ఆదివారం అర్ధరాత్రి తరువాత భక్తులను దర్శనానికి అనుమతించారు. దీంతో తిరుమల ఆలయ ప్రాంగణం అంతా భక్తులతో రద్దీతో నిండిపోయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వైకుంఠ ఏకాదశి రోజు శ్రీవారి హుండీ ఆదాయం కొత్త రికార్డు సృష్టించింది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రూ.7.68 కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పటివరకు గతేడాది అక్టోబర్ 23వ తేదీన లభించిన రూ.6.31 కోట్లే అత్యధిక హుండీ ఆదాయం. తాజాగా ఆ రికార్డు కూడా బ్రేక్ అయింది. సోమవారం 69 వేల 414 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 18,612మంది భక్తులు  స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 


భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని.. గత రెండు సంవత్సరాలుగా జరుగుతున్న విధంగానే ఈ ఏడాది కూడా వైకుంఠ ద్వార దర్శనం 11 రోజులపాటు కల్పించనుంది టీటీడీ. ప్రతిరోజు 80 వేల మంది భక్తులకు దర్శనం కల్పించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. అన్నిరకాల ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేయగా.. శ్రీవాణి, ఎస్ఈడీ టిక్కెట్లు, ఎస్ఎస్డీ టోకెన్లు కలిగి ఉన్న భక్తులకు "మహా లఘు దర్శనం" కల్పిస్తున్నారు. ఎక్కువ మంది సామాన్య భక్తులకు దర్శనం కల్పించేందుకు వీలుగా ఉదయం 6 గంటలకే స్వామి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు.


రూ.300 కోటా ప్రత్యేక ప్రవేశ దర్శనం దర్శనానికి సంబంధించి రోజుకు 25 వేల టికెట్లు విడుదల చేశారు. 10 రోజులకు కలిపి మొత్తం 2.50 లక్షల టికెట్లు విడుదల చేశారు. అదేవిధంగా తిరుమల స్థానిక భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేయడంతో పాటు తిరుపతిలో 9 కేంద్రాలను ఏర్పాటు చేశారు టీటీడీ అధికారులు. వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా 11 రోజులపాటు సిఫార్సు లేఖలకు తీసుకోమని ఇప్పటికే తెలిపారు. రోజుకు 2 వేల చొప్పున శ్రీవాణి టిక్కెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. ప్రతిరోజూ 2 వేల మంది దాతలు తమ దర్శన కోటాను కూడా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. వైకుంఠ ఏకాదశికి స్వయంగా వచ్చే ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే దర్శన టిక్కెట్లు కేటాయించనున్నారు. 


Also Read: Ind Vs SL: ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ రెడీ.. నేడే లంకేయులతో సమరం  


Also Read: Gade Venkata Reddy: భార్య నగలు తాకట్టు పెట్టా.. 70 ఎకరాలు అమ్ముకున్నా.. వైసీపీ జడ్పీటీసీ ఆవేదన  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి