Srivari salakatla theppotsavalu in Tirumala: తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు (Srivari salakatla theppotsavalu) ఆదివారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. విద్యుద్దీపాలు, పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా  శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చారు. ముందుగా సాయంత్రం 6 గంటలకు శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రుని ఉత్సవమూర్తుల ఊరేగింపు మొదలైంది. ఆలయ నాలుగు మాడ వీధుల గుండా పుష్కరిణి  వద్దకు చేరుకుంది. తొలిరోజు శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామివారు పుష్కరిణిలో తెప్పపై మూడు చుట్లు తిరిగి కనువిందు చేశారు. వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది.ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్దజీయర్ స్వామి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ ర‌మేష్‌బాబు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తిరుమల (Tirumala) తెప్పోత్సవాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎన్నో శతాబ్దాలుగా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. శ్రీ సాళువ నరసింహరాయలు క్రీ.శ 1468లో పుష్కరిణి మధ్యలో నీరాళి మండపాన్ని నిర్మించటంతోపాటు తెప్పోత్సవాలకు అనువుగా దానిని తీర్చిదిద్దారు. క్రీ.శ.15వ శతాబ్దానికి చెందిన శ్రీ తాళ్లపాక అన్నమయ్యచార్యులు తిరుమల తెప్పోత్సవాలను గొప్పగా కీర్తించారు. ఈ తెప్పోత్సవాల కారణంగా మార్చి 13,14న జరగాల్సిన వర్చువ ల్ అర్జిత సేవలైన సహస్ర దీపాలంకార సేవను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. మార్చి 17తో సాలకట్ల తెప్పోత్సవాలు ముగియనున్నట్లు టీటీడీ తెలిపింది.


Also Read: Polavaram Project: పోలవరంలో కీలక ఘట్టం.. ప్రాజెక్టు గేట్లు అమరిక పూర్తి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook